సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రెండో భాగం రెడీ!

ABN, First Publish Date - 2022-12-29T01:24:49+05:30

దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సెకండ్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధమవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సెకండ్‌ పార్ట్‌ విడుదలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా బుధవారం అధికారికంగా ప్రకటించింది. 1955లో కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నారు మణిరత్నం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మొదటి భాగం తమిళం సహా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై విజయం సాధించింది. విక్రమ్‌, ఐశ్వర్యా రాయ్‌, కార్తీ, త్రిష, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రముఖ తారలు ఈ చిత్రంలో నటించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2022-12-29T01:24:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!