సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ముహూర్తం కుదిరింది

ABN, First Publish Date - 2022-06-01T11:27:51+05:30

ప్రభాస్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభాస్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘ఆది పురుష్‌’, ‘స్పిరిట్‌’ ఇలా... బిజీ బిజీ. మారుతి కథకు సైతం ప్రభాస్‌ పచ్చజెండా ఊపారు. డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఎప్పుడో ఈ సినిమా ప్రారంభం కావాల్సింది. కానీ ప్రభాస్‌ బిజీ షెడ్యూల్‌ వల్ల కుదరలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి ముహూర్తం సెట్‌ అయ్యిందని టాక్‌. దసరా పండుగ రోజున ప్రభాస్‌ - మారుతి చిత్రానికి కొబ్బరికాయ కొడతార్ట. ఆ వెంటనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుందని టాక్‌. ఈలోగా ‘సలార్‌’ సినిమాని పూర్తి చేయాలని ప్రభాస్‌ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్‌ కోసం మారుతి ఓ ఫ్యామిలీ డ్రామాని సిద్ధం చేస్తున్నారని ఇందులో ముగ్గురు కథానాయికలు కనిపిస్తారని సమాచారం. ఇదో థ్రిల్లర్‌ కథ అని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ‘ఆది పురుష్‌’కి సంబంధించి ప్రభాస్‌ పని పూర్తయింది. ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌ కూడా శరవేగంగా సాగుతోంది.  


Updated Date - 2022-06-01T11:27:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!