కథను మలుపుతిప్పే నాయిక

ABN , First Publish Date - 2022-05-12T09:42:12+05:30 IST

గ్లామర్‌ పాత్రలతోనే కాదు నటనకు ఆస్కారమున్న పాత్రలతో అలరిస్తున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. వెంకటేష్‌కు జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’...

కథను మలుపుతిప్పే నాయిక

గ్లామర్‌ పాత్రలతోనే కాదు నటనకు ఆస్కారమున్న పాత్రలతో అలరిస్తున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. వెంకటేష్‌కు జోడీగా ఆమె నటించిన తాజా చిత్రం ‘ఎఫ్‌ 3’. ఈ సినిమాలో కథను మలుపుతిప్పే  హారిక పాత్రలో  తమన్నా కనిపించనున్నారు. సర్‌ప్రైజ్‌ ఇచ్చే ఎలిమెంట్స్‌తో సినిమాకు హారిక పాత్ర ఓ హైలెట్‌గా నిలవబోతోంది. ‘ఎఫ్‌ 3’ కథ మొత్తం హారిక పాత్ర చుట్టూ తిరిగేలా అనిల్‌ రావిపూడి డిజైన్‌ చేశారట. వెంకటేష్‌-తమన్నా మధ్యన వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు వినోదం పంచేలా ఉంటాయి. ‘మన ఆశలే మన విలువలు’ అంటూ తమన్నా పలికిన డైలాగ్‌లు ఇప్పటికే వైరల్‌ అయ్యాయి. మొత్తం మీద తమన్న కెరీర్‌లో హారిక పాత్ర ది బెస్ట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో రెడ్‌ హాట్‌ డ్రెస్‌లో ఉన్న తమన్నా లుక్‌ను రిలీజ్‌ చేశారు. 

Updated Date - 2022-05-12T09:42:12+05:30 IST

Read more