‘ది ఘోస్ట్’: ఊటీలో తాజా షెడ్యూల్ ప్రారంభం..

ABN , First Publish Date - 2022-04-08T15:15:22+05:30 IST

టాలీవుడ్ కింగ్ నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా,

‘ది ఘోస్ట్’: ఊటీలో తాజా షెడ్యూల్ ప్రారంభం..

టాలీవుడ్ కింగ్ నాగార్జున టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన దుబాయ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను, యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. ఇదే క్రమంలో తాజా షెడ్యూల్‌ను మేకర్స్ ఊటీలో ప్రారంభించారు. విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియచేశారు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ది ఘోస్ట్’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం. ఏషియన్ సునీల్, నారణ దాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.Updated Date - 2022-04-08T15:15:22+05:30 IST

Read more