సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కసి, ప్రేమతో చేసిన చిత్రం ‘ది ఘోస్ట్‌’

ABN, First Publish Date - 2022-10-01T05:32:58+05:30

‘‘ది ఘోస్ట్‌’ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో రూపొందించాం. కసితో, గొప్ప ప్రేమతో ఈ సినిమాకు పనిచేశాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ది ఘోస్ట్‌’ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా గొప్ప నిర్మాణ విలువలతో రూపొందించాం. కసితో, గొప్ప ప్రేమతో ఈ సినిమాకు పనిచేశాం. సినిమా సాంకేతికంగా చాలా పై స్థాయిలో ఉంటుంది’ అని నాగార్జున అన్నారు. ఆయన హీరోగా దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు రూపొందించిన ‘ది ఘోస్ట్‌’ చిత్రం అక్టోబరు 5న విడుదలవుతోంది. శుక్రవారం ఈ చిత్రం రిలీజ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. నాగార్జున మాట్లాడుతూ ‘ప్రవీణ్‌ సత్తారు సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. విడుదల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నాను. ‘ది ఘోస్ట్‌’తో పాటు చిరంజీవి గారి ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కూడా విడుదలవుతోంది. ఆ సినిమా కూడా సూపర్‌హిట్‌ అవ్వాలి’ అని కోరుకున్నారు. ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ ‘ఇది నాగార్జున గారి కోసం రాసుకున్న కథ. ప్రేక్షకుల మనసును గెలుచుకునే చిత్రం ఇది’ అన్నారు. ఇదొక గొప్ప యాక్షన్‌ చిత్రం, ఇప్పటిదాకా ఇలాంటి పాత్ర చేయలేదు అని చిత్ర కథానాయిక సోనాల్‌ చౌహాన్‌ చెప్పారు. 


రాజకీయాల్లోకి రాను...

అవకాశం వస్తే సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తాను తప్ప రియల్‌ పాలిటిక్స్‌లోకి వచ్చే ఆలోచన లేదు అని నాగార్జున అన్నారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇది గత 15 ఏళ్లుగా జరుగుతున్న ప్రచారమేనంటూ కొట్టిపారేశారు. 

Updated Date - 2022-10-01T05:32:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!