ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే: వరుణ్ తేజ్

ABN , First Publish Date - 2022-04-03T22:39:51+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా, కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన తాజా చిత్రం 'గని'. అల్లు బాబి - సిద్దు ముద్ద కలిసి నిర్మించిన

ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా, కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన తాజా చిత్రం 'గని'. అల్లు బాబి - సిద్దు ముద్ద కలిసి నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 8న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం వైజాగ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 


ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ' ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ముఖ్య అతిథులందరికీ థాంక్స్. 'గని' సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు 'తమ్ముడు' సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు 'గని' వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. 'గని' విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. 


ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను.. దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్‌ను ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. 'గని' సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్‌గా కనిపించకూడదు.. అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.

Updated Date - 2022-04-03T22:39:51+05:30 IST

Read more