Anu Emmanuel: మా ఇద్దరి లవ్ సీన్స్, కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి: అను ఇమ్మాన్యుయేల్
ABN , First Publish Date - 2022-11-02T21:20:34+05:30 IST
Anu Emmanuel: మా ఇద్దరి లవ్ సీన్స్, కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి: అను ఇమ్మాన్యుయేల్
అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) తెలుగులో మంచి బ్రేక్ వచ్చి చాలా కాలం అయింది. ఇప్పుడు ఆమె అల్లు శిరీష్ (Allu Sirish) తో చేస్తున్న 'ఉర్వశివో రాక్షసీవో' (Urvasivo Rakshasivo) సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రచారం విపరీతంగా చేశారు. ప్రచార వీడియోస్ కూడా చాలా ఆకర్షణీయంగా, ఆసక్తికరంగా వున్నాయి. అను ఈ సినిమా కథ బాగుంది అని సెలెక్ట్ చేసుకుందట. ఇప్పుడు హీరో ఎవరు అని కాకుండా, కంటెంట్ ముఖ్యం అని ప్రేక్షకులు చూస్తున్నారు, అందుకనే ఈ సినిమా కంటెంట్ బాగుంది, హీరోయిన్ కి నటనకి మంచి స్కోప్ వున్నా పాత్ర అని ఈ సినిమా ఎంపిక చేసుకుంది అని చెప్తోంది.
అయితే ఈ సినిమాలో శిరీష్ హీరో అని ఆమెకి ముందే తెలుసు అంటోంది. కానీ శిరీష్ ని ఎప్పుడూ కలవలేదుట, కేవలం ఈ సినిమా అప్పుడు కలిసి అప్పటి నుండి పరిచయం అయ్యాడు అంటోంది. ఈ సినిమా పూజ రోజున మొదటిసారి కలిశాని శిరీష్ ని అని చెప్తోంది. డైరెక్టర్ కథ మొత్తం నెరేట్ చేశాక అను ఇమ్మాన్యుయేల్, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నారట. అలాగే ఇద్దరు ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకున్నాము అని చెప్తోంది.
శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి ఇద్దరం చాలా కష్టపడ్డాం అని చెప్తోంది. స్క్రీన్ మీద వీళ్లిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్, కెమిస్ట్రీ, ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి అని చెప్తోంది. (Anu says that the love scenes, the chemistry between her and Sirish and emotions come out well) 'శిరీష్ గుడ్ కోస్టార్. సినిమా మేకింగ్ మీద చాలా పట్టుంది. మ్యూజిక్, ఆర్ట్, టెక్నికల్ ఇలా అన్ని విషయాల మీద అతనికి అవగాహన ఉంది. నాతో మ్యూజిక్ గురించి ఎక్కువగా మాట్లాడేవాడు', అని చెప్తోంది అను ఇమ్మాన్యుయేల్. ఈ చిత్రానికి దర్శకుడు రాకేశ్ శశి (#UrvasivoRakshasivo #AnuEmmanuel #AlluSirish)