సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Akkineni Nagarjuna: నాగార్జున కెరీర్ లో ఇదే పెద్ద సవాలు

ABN, First Publish Date - 2022-09-27T18:30:38+05:30

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండో జనరేషన్ (Second generation) నటుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించు కున్న నటుడు అని చెప్పాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో  రెండో జనరేషన్ (Second generation) నటుల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించు కున్న నటుడు అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క కమర్షియల్ సినిమాలు (Commercial cinema) చేస్తూనే, భక్తిరస (Devotional) పాత్రలు అయిన అన్నమయ్య (Annamayya),  రామదాసు (Sri Ramadasu), షిర్డీ సాయి (Shirdi Sai) లాంటి సినిమాలు చేసి ఎంతో మెప్పించారు. అన్నమయ్య సినిమాకి మీసం (mustache)  ఉండాలా వద్దా.. అనే విషయం మీద అప్పట్లో ఒక వివాదం జరిగినా.. మీసం తీయకుండానే నటించి మెప్పించారు. ఆ సినిమా ఒక పెద్ద హిట్ మరియు నాగార్జున కెరీర్ లో ఒక మైలు రాయి కూడా అయింది. ఎన్నో మంచి మంచి పాత్రలు వేసి మెప్పించిన నాగార్జున ఇప్పుడు 'ఘోస్ట్' (Ghost) అనే సినిమాతో ఈ దసరాకి (Dasara) వస్తున్నాడు. 


తన కెరీర్ లో ఎప్పుడయినా ఛాలెంజ్ (Challenging) లాంటిది  ఎదురయిందా అని అడిగితే, ఒకసారి అయింది అని చెప్పారు. "నిన్నే పెళ్లాడుతా (Ninne Pelladutha) మరియు అన్నమయ్య (Annamayya) రెండు సినిమాలు షూటింగ్ ఏకకాలం లో అయ్యాయి. రెండు విభిన్న పాత్రలు ఒకదానికొకటి అస్సలు పోలిక లేదు, అప్పుడు అదొక ఛాలెంజ్ లా వుండింది. నిన్నే పెళ్లాడుతా షూటింగ్ చేసి వెంటనే అన్నమయ్య షూటింగ్ లో పార్టిసిపేట్ చెయ్యడం ఆ పాత్రలోకి మమేకం అవటం అంత సులువు కాదు, అదే పెద్ద సవాల్ నాకు," అన్నారు నాగార్జున. 

అలాగే చాలామంది నటులు, వాళ్ళు పోషిస్తున్న క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలానే కెమెరా ముందు నుండి బయటకి వచ్చాక కూడా అలానే ఉంటూ వుంటారు. "నేను కెమెరా ముందు నుండి బయటకి వచ్చి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, నా మైండ్ లో ఒక వేపు ఆ క్యారెక్టర్ గురించి, దర్శకుడు ఏమి చెప్పాడు, అతనికి ఎలా కావాలి అన్న పాయింట్ ఆలోచిస్తూ ఉంటుంది. కొందరు నటులు అయితే మాత్రం ఆ క్యారెక్టర్ లో ఉండిపోతారు  మాట్లాడరు, నేను అలంటి వాళ్ళను చూసాను. ఆలా వుండేవాళ్ళను నేను మధ్యలో మాట్లాడించాను," అన్నారు నాగార్జున. కర్నూల్ (Kurnool) లో ఘోస్ట్ ప్రీ రిలీజ్ (Pre-release) ఈవెంట్ కి నాగార్జున కుమారులు ఇద్దరూ, అఖిల్ (Akhil Akkineni) మరియు చైతన్య (Chaitanya Akkineni) హాజరయి తండ్రికి బాసటగా నిలిచారు. నాగార్జున భార్య (Wife) అమల (Amala Akkineni) కూడా 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham) అన్న సినిమాలో శర్వానంద్ (Sharwanand) మదర్ గా నటించారు. 

Updated Date - 2022-09-27T18:30:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!