మంచి సినిమాని ప్రేక్షకులు వదులుకోరు

ABN , First Publish Date - 2022-12-19T23:59:33+05:30 IST

తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సోమవారం...

మంచి సినిమాని ప్రేక్షకులు వదులుకోరు

ఇంద్రసేన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శాసనసభ’. రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రధారి. వేణు మడికంటి దర్శకుడు.

తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సె్‌సమీట్‌ ఏర్పాటు చేసింది. రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పటికీ వదలుకోరు. ఇన్నేళ్ల అనుభవంలో నేను గమనించిన విషయం ఇదే. ‘శాసనసభ’కు థియేటర్లు పెరిగాయంటేనే.. ఈ సినిమా ఎంత నచ్చిందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘ఇంద్రసేనని యాక్షన్‌ హీరోగా నిలబెట్టేందుకు మేం చేసిన ప్రయత్నం ఫలించింద’’న్నారు దర్శకుడు. యాక్షన్‌ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోందని ఇంద్రసేన తెలిపారు. ఓ మంచి చిత్రానికి దక్కిన విజయం ఇదని నిర్మాతలు అన్నారు.

Updated Date - 2022-12-20T00:08:05+05:30 IST

Read more