ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు

ABN , First Publish Date - 2022-11-30T04:54:11+05:30 IST

‘‘గుర్తుందా శీతాకాలం’ లాంటి ఒక మంచి చిత్రంతో తొలిసారి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో నేను...

ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు

‘‘గుర్తుందా శీతాకాలం’ లాంటి ఒక మంచి చిత్రంతో తొలిసారి హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇందులో నేను అమ్ములు అనే కాలేజీ అమ్మాయిపాత్రను పోషించాను. ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని కావ్యాశెట్టి అన్నారు. ఆమె సత్యదేవ్‌ కు జోడీగా నటించిన చిత్రం ఇది. నాగశేఖర్‌ దర్శకుడు. డిసెంబరు 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కావ్యాశెట్టి మాట్లాడుతూ నేను కన్నడ అమ్మాయిని. కన్నడ సినిమాలతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ నటించాను. ‘లవ్‌ మాక్టేల్‌’ చిత్రం హీరోయిన్‌గా నాకు మంచి పేరుతెచ్చింది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఒక వ్యక్తి జీవితంలో మూడు దశల్లో సాగే మూడు ప్రేమకథలతో ‘గుర్తుందా శీతాకాలం’రూపొందింది. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. 


ఇది హీరోయిన్‌గా నా కెరీర్‌ను మలుపుతిప్పే చిత్రం అవుతుందనుకుంటున్నాను. సత్యదేవ్‌ చాలా కష్టపడి పనిచేస్తారు. తెలుగు డైలాగ్స్‌ పలకడంలో సాయం చేశారు. తమన్నాతో నాకు కాంబినేషన్‌ సీన్లు లేవు. ఇందులో నాకు రెండు పాటలు ఉన్నాయి. నేను డీ గ్లామర్‌ పాత్రలో చేశాను కానీ  గ్లామర్‌ రోల్స్‌ అంటేనే నాకు ఇష్టం. 


కన్నడ నుంచి వచ్చిన అనుష్కశె ట్టి, పూజాహెగ్డే, రష్మిక ఇతర హీరోయిన్లలా నన్ను కూడా ఆదరించాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నాను. 


Updated Date - 2022-11-30T04:54:11+05:30 IST

Read more