సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జూన్‌లో రారాజు రాక

ABN, First Publish Date - 2022-05-22T08:01:21+05:30

‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో యష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రారాజు’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘కేజీఎఫ్‌’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరో యష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రారాజు’. కన్నడలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఎస్‌. సుబ్బారావు మాట్లాడుతూ ‘యష్‌ ఆయన సతీమణి రాధికా పండిట్‌ జంటగా నటించారు. జూన్‌ ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తా’మన్నారు. కిక్‌ శ్యామ్‌, సీత, రవిశంకర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. మహేష్‌రావు దర్శకుడు. సంగీతం: హరికృష్ణ.


Updated Date - 2022-05-22T08:01:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!