అందుకే ఆ సినిమా చేయట్లేదు!

ABN , First Publish Date - 2022-11-15T05:51:13+05:30 IST

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘ఫిర్‌ హరా ఫెరీ’ వచ్చి 22 ఏళ్లయిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకొంటూనే ఉంటారు...

అందుకే ఆ సినిమా చేయట్లేదు!

అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘ఫిర్‌ హరా ఫెరీ’ వచ్చి 22 ఏళ్లయిపోయింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకొంటూనే ఉంటారు. ఆ సినిమా చూసి మళ్లీ మళ్లీ నవ్వుకొంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపుదిద్దుకొంటోంది. అయితే ఈ సీక్వెల్‌లో అక్షయ్‌ నటించడం లేదన్న వార్త.. ఆయన అభిమానుల్ని కలవరపాటుకు గురి చేస్తోంది. అక్షయ్‌ స్థానంలో కార్తీక్‌ ఆర్యన్‌ వచ్చాడని టాక్‌. దీనిపై అక్షయ్‌ స్పందించారు. ‘‘నాకు చాలా ఇష్టమైన సినిమాల్లో ‘ఫిర్‌ హరా..’ ఒకటి. ఈ సినిమాకి సీక్వెల్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నా. ఈమధ్య సీక్వెల్‌ కథ కూడా నా దగ్గరకు వచ్చింది. అయితే... ఈ సినిమా నేను చేయడం లేదు. దానికి కారణం.. కథ, స్ర్కీన్‌ప్లే.. సంతృప్తికరంగా అనిపించకపోవడమే. కథ పకడ్బందీగా లేనప్పుడు... సీక్వెల్‌, రీమేక్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. అందుకే ఆ అవకాశాన్ని వదులుకొన్నా’’ అని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-15T05:51:13+05:30 IST

Read more