సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Thankyou : ఓటీటీలోకి వచ్చేస్తోంది !

ABN, First Publish Date - 2022-08-09T19:37:04+05:30

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya), రాశీఖన్నా (Rashi Khanna), మాళవికా నాయర్ (Malavika Nayar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ’ (Thankyou). విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya), రాశీఖన్నా (Rashi Khanna), మాళవికా నాయర్ (Malavika Nayar) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ’ (Thankyou).  విక్రమ్ కె కుమార్ (Vikram K Kumar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dilraju) నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. నాగచైతన్య మూడు వేరియేషన్స్ కలిగిన పాత్రల్లో మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చినప్పటికీ చిత్రం అంతగా జనానికి రీచ్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలై నెలరోజులు కాకుండానే.. ఓటీటీలోకి రానుండడం గమనార్హం. 


‘థాంక్యూ’ చిత్రాన్ని ఈ నెల 11న అమెజాన్ ప్రైమ్‌ (Amazon Prime) లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. ఇండియాతో పాటు మొత్తం 240 దేశాల్లో దీన్ని స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని నేడు (మంగళవారం) ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్. కష్టపడి ఉన్నత స్థితికి చేరుకున్న ఓ యువకుడు.. తన వల్లే తాను ఎదిగాననే గర్వంతో బతుకుతుంటాడు. అయితే ఒక సంఘటనతో కళ్ళు తెరుచుకొని.. తన జీవితంలో తన ఉన్నతికి కారణమైన వారికి థాంక్స్ చెప్పడానికి బైలు దేరతాడు. చివరికి అతడు తను అనుకున్నది సాధించగలిగాడా? లేదా అన్నది మిగతా కథ. 


అవికాగోర్, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, రాజశ్రీనాయర్, తులసి, ఈశ్వరీరావు, మిర్చీ హేమంత్, భరత్ రెడ్డి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తమన్ (Thaman) సంగీతం అందించగా.. పీసీ శ్రీరామ్ (PC Sriram) ఛాయాగ్రహణం నిర్వహించారు. మరి థియేటర్స్‌లో అంతగా మెప్పించలేకపోయిన ఈ  సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి. 



Updated Date - 2022-08-09T19:37:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!