సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కాలేజీ రోజులకు ‘థ్యాంక్యూ’

ABN, First Publish Date - 2022-06-28T05:38:28+05:30

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘థ్యాంక్యూ’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. రాశీఖన్నా, మాళవిక నాయర్‌ నిర్మాతలు. సోమవారం ఈ చిత్రం నుంచి ఫేర్‌వెల్‌ గీతాన్ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ‘‘మన జీవితంలో చాలామందికి రుణపడి ఉంటాం. వాళ్లందరికీ ఏదో ఓ సందర్భంలో థ్యాంక్స్‌ చెప్పాలనుకొంటాం. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో చైతూ లుక్‌ చాలా బాగుంది. ఆయనలో నాగార్జున గారు కనిపించార’’న్నారు. ‘‘ఎంతో అందమైనది కాలేజీ జీవితం. అలాంటి కాలేజీని వదిలి వెళ్లే క్రమంలో వచ్చే ఫేర్‌వెల్‌ గీతమిది. ‘హ్యాపీడే్‌స’లోని ‘పాదమెటు పోతున్నా’ పాటంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాటని నా సినిమాలో పెట్టాలనుకొనేవాడ్ని. అది ఈ సినిమాతో తీరింద’’న్నారు దిల్‌ రాజు. ‘‘అందరి జీవితాల్లోనూ కాలేజీ రోజులు మధురమైనవి. దాన్ని ఈ పాటలో చెప్పామ’’న్నారు నాగచైతన్య. జులై 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 


Updated Date - 2022-06-28T05:38:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!