సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Veerasimha Reddy: అడ్డంగా దొరికిపోయిన థమన్

ABN, First Publish Date - 2022-11-26T21:06:36+05:30

ఈ పాట విడుదల అయిన వెంటనే, నెటిజన్స్ సాంఘీక మాధ్యమాల్లో థమన్ ని ఆడుకున్నారు. ఈ పాట ట్యూన్ 'ఒసేయి రాములమ్మ' లో 'నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా... ' అనే పాటకి మక్కీకి మక్కిగా ఆలా దించేసాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే (Releasing on Sankranthi festival). అయితే ప్రచారం లో భాగంగా ఈరోజు అంటే నవంబర్ 25 న ఆ సినిమాలో నుంచి 'జై బాలయ్య' (Jai Balayya song) అనే పాటను విడుదల చేశారు. దీనికి అగ్ర సంగీత దర్శకుల్లో ఒకడు అయిన ఎస్ ఎస్ థమన్ (SS Thaman is the music director) సంగీతం అందించాడు. ఈ పాట విడుదల అయిన వెంటనే, నెటిజన్స్ సాంఘీక మాధ్యమాల్లో థమన్ ని ఆడుకున్నారు. ఈ పాట ట్యూన్ 'ఒసేయి రాములమ్మ' లో 'నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా... ' అనే పాటకి మక్కీకి మక్కిగా ఆలా దించేసాడు. కనీసం ట్యూన్ కూడా మార్చలేదు. అందరూ ఇదేంటి థమన్ భయ్యా ఇలా చేసావు అని కూడా అంటున్నారు. ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు కూడా. సాంఘీక మాధ్యమాల్లో, ఇంటర్నెట్ లో ఈ పాట మీద కాకుండా, థమన్ ఎంత చీప్ గా పాత సినిమా నుండి ట్యూన్ ని కాపీ చేసేసాడు అన్న దానిమీదే ఎక్కువ చర్చ చేస్తున్నారు. ఈసారి మాత్రం థమన్ అడ్డంగా దొరికిపోయాడనే చెప్పాలి. 


మరీ ఆలా ఎలా చేస్తాడు, కనీసం ఎవరిని అడిగినా వెంటనే చెప్పేస్తారు కదా అని కూడా అంటున్నారు. ఆసక్తికరం ఏంటి అంటే, కనీసం దర్శకుడుకి, నిర్మాతలకి కూడా ఈ పాటని ఎక్కడో విన్నట్టు అనిపించకపోవటం. అంటే వీళ్ళందరికీ ఎంత సినిమా జ్ఞానం ఉండేవో అర్థం చేసుకోవాలి అని కూడా అంటున్నారు. థమన్ కి సినిమాలు ఎక్కువయిపోయి, అన్ని సినిమాలు తానే చేసెయ్యాలన్న తపనతో ఎదో ఒక ట్యూన్ ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు, కానీ ఇలా కాపీ చేసాక అతని మీద గౌరవం పోతుంది. ఇతని హిట్ అయిన ఇంతకు ముందు ఆల్బమ్స్ అన్నీ ఇతనే చేశాడా, లేక ఎక్కడయినా కాపీ కొట్టాడా, లేక ఎవరితో అయినా చేయించాడా అన్న అనుమానాలు కూడా వస్తాయి. ఏమయినా థమన్ సినిమాలు తగ్గించుకొని, క్వాలిటీ వున్న సంగీతం ఇస్తే బెటర్ అని అంటున్నారు. లేకపోతే ఇలానే అడ్డంగా దొరికిపోవాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఈ పాటని సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి (Ramajogiaah Sastry) రాసారు.

Updated Date - 2022-11-26T21:06:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!