సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay66: దళపతి విజయ్ - వంశీపైడిపల్లి కాంబో చిత్ర టైటిల్ ఏంటో తెలుసా?

ABN, First Publish Date - 2022-06-22T00:30:57+05:30

దళపతి విజయ్ (Thalapathy Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Varisu: దళపతి విజయ్ (Thalapathy Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి టైటిల్ ఖరారు చేశారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించబోతున్నామని తెలిపినట్లుగానే మేకర్స్.. మంగళవారం (జూన్ 21) సాయంత్రం ట్విట్టర్ వేదికగా టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రానికి తమిళ్‌లో ‘వారిసు’ (Varisu), తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కొన్ని రోజులుగా ఈ చిత్రానికి ‘వారసుడు’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడదే టైటిల్‌ని మేకర్స్ ఖరారు చేశారు. టైటిల్ రివీల్ చేస్తూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్‌లో విజయ్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 


విజయ్ సరసన నేషనల్ క్రష్  రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం.. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్‌గా.. శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా.. సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా పని చేస్తున్నారు. విజయ్ కెరీర్లో భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.





Updated Date - 2022-06-22T00:30:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!