Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి TFJA తీవ్ర సంతాపం

ABN , First Publish Date - 2022-11-15T22:39:46+05:30 IST

భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna)ది ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యక్తి నుండి వ్యవస్థగా

Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతికి TFJA తీవ్ర సంతాపం

భారతీయ చలన చిత్ర చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna)ది ఓ సువర్ణాధ్యాయం. నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యక్తి నుండి వ్యవస్థగా మారిన బంగారు మనిషి కృష్ణ. మహా నటుడు ఎన్టీయార్, ఏయన్నార్ అడుగు జాడల్లో నడుస్తూ, శోభన్ బాబుతో కలిసి తెలుగు సినిమా రంగానికి నాలుగో స్థంబంలా నిలిచారాయన. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, ఎడిటర్ గా అన్ని రంగాలపైనా పట్టు సంపాదించుకుని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలోనూ పలు చిత్రాలను నిర్మించారు. 300కు పైగా చిత్రాలలో నటించారు. తెలుగు తెరపై ఆయనే తొలి కౌబోయ్, ఆయనే మొదటి జేమ్స్ బాండ్, ఆయనే ఫస్ట్ సినిమా స్కోప్ హీరో, ఆయనే ప్రథమ 70 ఎం. ఎం. మూవీ డైరెక్టర్ కమ్ హీరో... చిత్రసీమలో డేరింగ్ డాషింగ్ అనే పదాలకు నిలువెత్తు నిర్వచనం కృష్ణ. ఆయన మరణం కోట్లాది మంది అభిమానులను దుఃఖ సాగరంలో ముంచింది. సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు పూడ్చలేనిది. 


ఆయన మృతికి తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అందరి సభ్యుల తరుపున అధ్యక్ష కార్యదర్శులు వి. లక్ష్మీనారాయణ, వై. జె. రాంబాబు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ఒకే యేడాది సోదరుడిని, తల్లిదండ్రులను కోల్పోయిన మహేశ్ బాబుకు, ఘట్టమనేని ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA) ప్రార్థిస్తోంది.



Updated Date - 2022-11-15T22:39:46+05:30 IST