ఎర్రర్‌తో టెర్రర్‌

ABN , First Publish Date - 2022-11-15T05:52:10+05:30 IST

జస్వంత్‌ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని జంటగా నటించిన చిత్రం ‘ఎర్రర్‌ 500’. సాందీప్‌ మైత్రేయ దర్శకుడు. బాలరెడ్డి నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు...

ఎర్రర్‌తో టెర్రర్‌

జస్వంత్‌ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని జంటగా నటించిన చిత్రం ‘ఎర్రర్‌ 500’. సాందీప్‌ మైత్రేయ దర్శకుడు. బాలరెడ్డి నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.ఎన్‌.ఆదిత్య మాట్లాడుతూ ‘‘టైటిల్‌ బాగుంది. జెస్సీకి ఇది పర్‌ఫెక్ట్‌ టైటిల్‌. నేను ప్రతీరోజూ ‘బిగ్‌ బాస్‌’ చూస్తుంటా. బిగ్‌ బాస్‌ స్టార్లంతా ఈ వేడుకలో కనిపించడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘ఈ సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. నిర్మాత ఈ కథపై నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు. ఆ నమ్మకాన్ని కచ్చితంగా నిలబెట్టుకొంటామ’’ని జెస్సీ తెలిపారు. ‘‘ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. చాలా కొత్తగా ఉందంటూ అభినందిస్తున్నారు. ట్రైలర్‌లా సినిమా కూడా వైవిధ్యభరితంగా ఉంటుంద’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. 


Updated Date - 2022-11-15T05:52:10+05:30 IST

Read more