సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Gossips: ముంబైలో గాసిప్స్ తెలుగులో మాట్లాడతారట!

ABN, First Publish Date - 2022-08-25T23:32:54+05:30

మన తెలుగు చిత్రాలలో (Tollywood Films) ఎక్కువగా హిందీ అమ్మాయిలను కథానాయికలుగా తీసుకుంటారు, అలాగే కొంతమంది విలన్స్‌ని కూడా. ఇదేమి కొత్త విషయం కాదు, కానీ ఇక్కడ వార్త ఏంటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన తెలుగు చిత్రాలలో (Tollywood Films) ఎక్కువగా హిందీ అమ్మాయిలను కథానాయికలుగా తీసుకుంటారు, అలాగే కొంతమంది విలన్స్‌ని కూడా. ఇదేమి కొత్త విషయం కాదు, కానీ ఇక్కడ వార్త ఏంటి అంటే.. ఇలా నటిస్తున్న భామలు అందరూ కొద్దో గొప్పో తెలుగు (Telugu) నేర్చుకున్నారు, కొందరు మాట్లాడతారు కూడా. ఈ తెలుగు మాట్లాడటం వాళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారో.. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముంబై‌లో గాసిప్స్ (Gossips) మాట్లాడాలి అనుకుంటే ఈ భామలు అందరూ తెలుగులో మాట్లాడతారట. 


తెలుగులో నటిస్తున్న వీరు ఒకరికి ఒకరు తారస పడినప్పుడు, లేదా ఆ నటీమణి వ్యక్తిగత స్టాఫ్ ముంబై వెళ్ళినప్పుడు వాళ్ళతో, లేదా ఫోన్‌లో హైదరాబాద్‌లో ఎవరితోనైనా మాట్లాడినప్పుడు.. వీళ్ళు మాట్లాడే భాష తెలుగు అట. ఇది నిజంగా కొత్త విషయమే! ఈ విషయాన్ని స్వయంగా ఒక భామే చెప్పింది. ముంబై (Mumbai) వెళ్లినా.. తెలుగు మరిచిపోలేదు అని అడిగితే, మేము ముంబై‌లో గాసిప్స్ మాట్లాడేది తెలుగులోనే కదా అని బదులిచ్చింది.

Updated Date - 2022-08-25T23:32:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!