Gowtham Raju కి తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళులు..

ABN , First Publish Date - 2022-07-08T19:05:59+05:30 IST

ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతం రాజు (Editor Goutham Raju) ఈనెల 6వ తేదీ స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఎడిటర్ యూనియన్ వారు చిత్రపరిశ్రమ తరుపున హైదరాబాద్

Gowtham Raju కి తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళులు..

ప్రముఖ సీనియర్ ఎడిటర్ గౌతం రాజు (Editor Goutham Raju) ఈనెల 6వ తేదీ స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఎడిటర్ యూనియన్ వారు చిత్రపరిశ్రమ తరుపున హైదరాబాద్  బంజారాహిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో 7-7-22వ తేదీ సంతాప సభ నిర్వహించారు.. కార్యక్రమానికి చాలామంది సినీ ప్రముఖులు హాజరై ఆయనకు ఘన నివాళులర్పించారు.. ప్రముఖులు మాట్లాడుతూ ఎప్పుడూ ఎడిటింగ్ ఎడిటింగ్ అని నిరంతరం పనిచేస్తూ ఆయన జీవితాన్ని ఎడిటింగ్ రూమ్ కు అంకితం చేశారని,  కాలానుగుణంగా మారుతున్న టెక్నాలజీని అవగాహన చేసుకొని ఎడిటింగ్ విభాగంలో అత్యధిక సినిమాలు దాదాపు 800 లకు పైగా సినిమాలు చేసిన ఎడిటర్ గా నిలిచాడని, పెద్ద పెద్ద హీరోలతో, పెద్ద పెద్ద డైరెక్టర్ లతో పనిచేసిన ఘనత ఆయన సొంతమని, ఎడిటింగ్ విభాగంలో రారాజుగా పేరు గడించాడని ఆయన సేవలను కొనియాడారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో తమ్మారెడ్డి భరద్వాజ, చదలవాడ శ్రీనివాస రావు, తెలు ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, సంయుక్త కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్, ట్రెజరర్ రామసత్యనారాయణ, దర్శక సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ ట్రెజరర్ సురేష్, ఎడిటింగ్ యూనియన్ అధ్యక్షులు కోటగిరి వెంకటేశ్వరరావు, సెక్రెటరీ మార్తాండ వెంకటేష్, ట్రెజరర్ మేనగ శ్రీనివాస రావు, పోకూరి బాబురావు, దర్శకులు యన్.శంకర్, భీమినేని శ్రీనివాస రావు , శివ నాగేశ్వర రావు, కృష్ణ మోహన్ రెడ్డి, వై.వి.యస్. చౌదరి, శ్రీవాస్, చంద్రమహేశ్, త్రిపురనేని చిట్టి, అలహరి, కె.అజయ్ కుమార్, సీనియర్ పాత్రకేయులు ప్రభు మరియు ఎడిటర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-08T19:05:59+05:30 IST