సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Video Viral: టాలీవుడ్ స్టార్ హీరోలపై టీఎఫ్‌సీసీ సెక్రటరీ సంచలన వ్యాఖ్యలు.. ఫేక్ కలెక్షన్లతో..

ABN, First Publish Date - 2022-07-27T15:44:51+05:30

బాలీవుడ్ వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటూ సమస్యల్లో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ఇతర పరిశ్రమల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటూ సమస్యల్లో ఉందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. ఇతర పరిశ్రమల పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఏం లేదు. టాలీవుడ్‌లో సైతం చిరంజీవి(Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘ఆచార్య’ ప్రభాస్ (Prabhas) నటించిన ‘రాధే‌శ్యామ్’ వంటి పలు పెద్ద చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్స్‌గా నిలిచాయి. మహేష్ బాబు (Mahesh babu) నటించిన ‘సర్కారు వారి పాట’ వంటి పలు స్టార్ల సినిమాలు సైతం యావరేజ్‌గా నిలిచాయి. అయితే.. ఇలాంటి పలు సినిమాల కలెక్షన్లు, హీరోల పారితోషికాలపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి (Telugu Film Chamber of Commerce secretary) ముత్యాల రమేశ్ సంచలన కామెంట్స్ చేశారు.


ఓ ఇంటర్వ్యూలో ముత్యాల రమేశ్ (mutyala ramesh) మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన మాట్లాడుతూ.. ‘పరిశ్రమ చాలా కష్టాల్లో ఉంది. అందరూ నిర్మాతలు, డిస్ట్రీబ్యూటర్స్ నష్టపోయారు. కేవలం హీరోలు మాత్రమే సంతోషంగా ఉన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఫేక్ కలెక్షన్ల నెంబర్లు చెబుతూ వారి స్థాయిని ఇంకా పెంచుతున్నారు. దానివల్ల వారి రెమ్యూనరేషన్లు ఇంకా పెంచుకుంటున్నారు. ఇప్పటికైనా డిస్ట్రిబ్యూటర్స్ కళ్లు తెరిచి నిజాలు బయటపెడితే హీరోలు అందరూ కంట్రోల్ ఉంటారు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వైరల్ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ రమేశ్ వ్యాఖ్యలు నిజమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. 



Updated Date - 2022-07-27T15:44:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!