సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కృష్ణ చేతుల మీదుగా... 84 ఏళ్ల పాత్రికేయ చరిత్ర

ABN, First Publish Date - 2022-09-27T02:35:09+05:30

సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ యు.వినాయకరావు రాసిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ పుస్తకం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు కృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌ యు.వినాయకరావు రాసిన ‘తెలుగు సినీ పాత్రికేయ చరిత్ర’ (Telugu Cine Patrikeya charitra)పుస్తకం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు కృష్ణ, (Super star krishna)హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్‌, దాసరి, రామానాయుడు, విజయనిర్మలతోపాటు నా సినీ జీవిత విశేషాలతో నటించిన చిత్రాలతో ‘దేవుడులాంటి మనిషి’ పుస్తకం రాశారు. ఇప్పుడు తన తోటి జర్నలిస్ట్‌ల అందరి చరిత్రకు అక్షర రూపం ఇస్తున్న ఆయన ప్రయత్నం సక్సెస్‌ కావాలి’’ అని అన్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘84 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ చరిత్రని అక్షరాల్లో పెట్టాలనుకోవడం సాహసం. కానీ ఎంతో మంది జీవిత చరిత్రలు రాసిన వినాయకరావుకి ఇది సాధ్యమే. ఆయన ప్రయత్నం  సక్సెస్‌ కావాలి’’ అని అన్నారు. పుస్తక రచన పూర్తయిందని వచ్చే నెలలో విడుదల చేేసందుకు సన్నాహాలు చేస్తున్నామని వినాయకరావు చెప్పారు. 




Updated Date - 2022-09-27T02:35:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!