సాయిపల్లవికి బిగ్ షాక్!

ABN , First Publish Date - 2022-07-08T16:57:31+05:30 IST

నోరుమంచిదైతే.. ఊరు మంచిదవుతుందనే నానుడిని అనుభవ పూర్వకంగా తెలుసుకుంటున్నారు సెలబ్రిటీస్. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సాయిపల్లవికి బిగ్ షాక్!

హీరోయిన్ సాయిపల్లవికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ‘విరాటపర్వం’ చిత్ర ప్రమోషన్స్ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదస్పదమైన విషయం తెలిసిందే. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా అలాగే గోరక్షకులకు సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలని హిందువులు వ్యతిరేకించడమే కాకుండా.. ఆమెపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో సాయిపల్లవి వ్యాఖ్యలను ఖండిస్తూ.. భజ్‌రంగ్ ధళ్‌కి చెందిన ఓ కార్యకర్త ఆమెపై  హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు జూన్ 21న ఆమెకు నోటీసులు జారీ చేయగా.. ఆ నోటీసులను రద్దు చేయాలని కోరుతూ.. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టును సంప్రదించింది. అయితే సాయిపల్లవి అభ్యర్థనను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు.. దానిని తోసిపుచ్చుతూ.. ఖచ్చితంగా నోటీసులకు స్పందించాల్సిందేనంటూ, ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.


అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ క్రింది వీడియో చూడండిUpdated Date - 2022-07-08T16:57:31+05:30 IST

Read more