సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Teja Sajja‌ కు వరుస ఆఫర్స్..

ABN, First Publish Date - 2022-08-02T19:12:32+05:30

టాలీవుడ్‌లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా (Teja Sajja). అవన్నీ దాదాపు మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత నందిని రెడ్డి (Nandini Reddy) ‘ఓ బేబీ’ (Oh Baby) సినిమాతో యువకుడిగా మళ్ళీ సినీ ఎంట్రీ ఇచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో బాలనటుడిగా లెక్కకు మించిన చిత్రాల్లో నటించాడు తేజా సజ్జా (Teja Sajja). అవన్నీ దాదాపు మంచి సక్సెస్ సాధించాయి. ఆ తర్వాత నందిని రెడ్డి (Nandini Reddy) ‘ఓ బేబీ’ (Oh Baby) సినిమాతో యువకుడిగా  మళ్ళీ సినీ ఎంట్రీ ఇచ్చాడు. దానికి మంచి పేరొచ్చింది. ఇక అతడ్ని హీరోగా మార్చిన ఘనత మాత్రం దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దే. ‘జాంబి రెడ్డి’ (Jobmbie Reddy) చిత్రంతో తేజా సజ్జా హీరోగా అడుగుపెట్టాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోగా మంచి అవకాశాలు అందుకున్నాడు.  ‘ఇష్క్, అద్భుతం’ చిత్రాలు అంతగా మ్యాజిక్ చేయనప్పటికీ.. అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తొలి సూపర్ హీరోగా ‘హనుమాన్’ (Hanuman) అనే మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నాడు. 


‘హనుమాన్’ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను రూ. 35 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తేజా రేంజ్‌కు ఆ బడ్జెట్ ఎక్కువనే చెప్పాలి. అమృతా అయ్యర్ (Amritha Ayyar) కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. దీని తర్వాత తేజా వరుసగా రెండు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. నక్కిన త్రినాథరావు (Nakkina Trinatharao) దర్శకత్వంలో ఒక సినిమాకి తేజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అతడు చెప్పిన ఓ కామెడీ కథాంశం తేజాకి బాగా నచ్చిందట. ప్రస్తుతం రవితేజతో ధమాకా అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు నక్కిన. ఇది పూర్తికాగానే తేజా సజ్జా హీరోగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. 


ఇక తేజా సజ్జా.. కార్తిక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్. నిఖిల్ (Nikhil) హీరోగా ‘సూర్య VS సూర్య’ (Surya Vs Surya) అనే మూవీ తెరకెక్కించిన కార్తిక్.. చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వం వహించబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. సినిమాటో గ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన కార్తిక్.. ఆ తర్వాత దర్శకుడిగా మారాడు. ‘కార్తికేయ 2’ (Karthikeya 2) చిత్రంతో ఎడిటర్ గానూ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇలా అన్ని శాఖల్లోనూ ప్రవేశమున్న కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజా సజ్జా సినిమా చేస్తుండడం విశేషమని చెప్పాలి. ‘హనుమాన్’ సినిమా ఏమాత్రం హిట్టయినా.. హీరోగా తేజా సజ్జా దశ తిరిగినట్టే. మరి ఆ సినిమా అతడికి ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.

Updated Date - 2022-08-02T19:12:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!