సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Team Liger: మైక్ టైసన్‌కు సర్‌ప్రైజ్

ABN, First Publish Date - 2022-06-30T17:37:10+05:30

తాజాగా 'లైగర్' (Liger) టీమ్ నుంచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ అందాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా 'లైగర్' (Liger) టీమ్ నుంచి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ అందాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో యంగ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'లైగర్'. 'సాలా క్రాస్ బ్రీడ్' అనే ట్యాగ్ లైన్‌తో రూపొందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ (Mike Tyson) ఈ మూవీ ద్వారా మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే. 


ఈరోజు (జూన్ 30) లెజండరీ బాక్సర్ అయిన మైక్ టైసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైగర్ మూవీ టీమ్ ఆయనకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు మేకర్స్. 'లైగర్' మూవీ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ (Karan Johar) చెప్పిన విషెస్ నుండి మొదలుకొని విజయ్ దేవరకొండ - ఛార్మీ కౌర్ (Charmy Caur) - విష్ణు - అనన్య పాండే (Ananya Pande)లతో పాటుగా దర్శకుడు పూరీ జగన్నాధ్ వరకూ అందరూ ఈ వీడియో ద్వారా టైసన్‌కు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు.


అంతేకాదు, ఈ సినిమా యుఎస్ఏ షెడ్యూల్‌కు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌ను కూడా తాజా వీడియోలో చూపించారు. ఇక ఈ వీడియోలో మైక్ టైసన్ చాలా సింపుల్‌గా కనిపించారు. బాక్సింగ్ దిగ్గజం టీమ్ అందరితో కలిసి ఎంతో ఉల్లాసంగా కనిపించారు. ఈ సందర్భంగా బిగ్ స్క్రీన్స్‌పై బిగ్ క్లాష్‌ని చూసేందుకు వేచి ఉండమని పూరీ టీమ్ పేర్కొంది. కాగా, లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యపాండే నటించింది. పూరి - ఛార్మీ - కరణ్ జొహార్ నిర్మాతలు. వచ్చే ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయనున్నారు. 



Updated Date - 2022-06-30T17:37:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!