సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Taxi Trailer : బలమున్నోడంటే.. బలహీనతలేనోడని అర్ధం !

ABN, First Publish Date - 2022-06-25T14:32:36+05:30

హెచ్ అండ్ హెచ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (H & H Entertainments) బ్యానర్‌పై హరిత సజ్జా (Haritha Sajja) నిర్మిస్తున్న ఇంటెన్స్ థ్రిల్లర్ ‘టాక్సీ’ (Taxi). స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీశ్ సజ్జా (Harish Sajja) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్ అండ్ హెచ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (H & H Entertainments) బ్యానర్‌పై హరిత సజ్జా (Haritha Sajja) నిర్మిస్తున్న ఇంటెన్స్ థ్రిల్లర్ ‘టాక్సీ’ (Taxi). స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీశ్ సజ్జా (Harish Sajja) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిక్కీ విజయ్ కుమార్ (Bikki Vijay Kumar) సహనిర్మాతగా వ్యహరిస్తున్నారు. ఈ సినిమాలో వసంత్ సమీర్ పిన్నమరాజు (Sasanth Sameer) హీరోగా నటిస్తున్నాడు.


‘కర్త కర్మ క్రియ’ (Kartha Karma Kriya) అనే సినిమాతో హీరోగా పరిచయం అయిన టాలెంటెడ్ యంగ్ హీరో వసంత్ సమీర్ పిన్నమరాజు ఈ సినిమాతో టాలీవుడ్‌‌లో యాక్షన్ హీరోగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు.  అల్మాస్ మోటీవాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్యా మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మార్క్ రాబిన్ (Mark Robin) సంగీతం అందిస్తున్నారు. సినిమా అతి త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలో ట్రైలర్ ను దర్శకుడు క్రిష్ (Krish) చేతుల మీదుగా విడుదల చేశారు. ఆసక్తికరమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


1నిమిషం59 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్ చాలా ఇంటెన్స్‌గా సాగుతూ.. సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ‘కాలిఫోర్నియమ్ 252’ (Californium 252) అనే చాలా అరుదైన హ్యూమన్ మేడ్ మెటల్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుంది. ‘బలవంతుడంటే.. బలమున్నోడు కాదు.. బలహీనత లేనోడు. అలాంటి బలహీనత కలిగిస్తే భగవంతుడైనా బలహీనుడవ్వాల్సిందే. యుగాలు మారినా, యుద్దాలు జరిగినా నమ్మకాన్ని చంపి మోసం గెలవడం మాత్రం మారలేదు’ లాంటి డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. టెక్నాలజీకి మోసాన్ని ముడిపెడుతూ..డిఫరెంట్ కథాంశంతో ‘టాక్సీ’ మూవీ రూపొందుతోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి.   



Updated Date - 2022-06-25T14:32:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!