Tarakaratna: ఎన్టీఆర్‌తో నాకు పోటీ లేదు!

ABN , First Publish Date - 2022-06-04T20:31:07+05:30 IST

‘‘నేను కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్న సినిమాల్లోకి వచ్చారని అంతా చెప్పుకొన్నారు. ఆ మాటల్లో నిజం లేదు. ఎన్టీఆర్‌ 2001లో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాతే నేను హీరోగా వచ్చా. నేను ఎప్పుడూ తారక్‌కి పోటీ అనుకోలేదు. ఆ రోజు నుంచి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సరైన సందర్భం కుదరలేదు. మేమంతా నందమూరి బిడ్డలమే. ఇప్పటికీ మా కుటుంబ పేరు అభిమానుల్లో నిలబడి ఉందంటే దానికి తారక్‌ ఒక కారణం’’ అని నందమూరి తారకరత్న అన్నారు.

Tarakaratna: ఎన్టీఆర్‌తో నాకు పోటీ లేదు!

‘‘నేను కెరీర్‌ ప్రారంభించిన సమయంలో ఎన్టీఆర్‌కి పోటీగా తారకరత్న (Tarakaratna)సినిమాల్లోకి వచ్చారని అంతా చెప్పుకొన్నారు. ఆ మాటల్లో నిజం లేదు. ఎన్టీఆర్‌ 2001లో ఇండస్ర్టీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాతే నేను హీరోగా వచ్చా. నేను ఎప్పుడూ తారక్‌కి(jr ntr) పోటీ అనుకోలేదు. ఆ రోజు నుంచి ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సరైన సందర్భం కుదరలేదు. మేమంతా నందమూరి బిడ్డలమే. ఇప్పటికీ మా కుటుంబ పేరు అభిమానుల్లో నిలబడి ఉందంటే దానికి తారక్‌ ఒక కారణం’’ అని నందమూరి తారకరత్న అన్నారు. ‘ఒకటో నంబర్‌ కుర్రాడు’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆయన హీరోగా, విలన్‌ విభిన్నమైన పాత్రలు పోషించి అలరించారు. తాజాగా ఆయన నటించిన వెబ్‌ సిరీస్‌ ‘9 అవర్స్‌’ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. దర్శకుడు క్రిష్‌ రచించిన ‘9 అవర్స్‌’లో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పారు. తారక్‌ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ‘‘నటుడు కావాలనేది నా కల. దానికి నాన్న, బాబాయ్‌ ప్రోత్సహించారు. నేను పరిశ్రమలోకి వచ్చే సమయానికే తమ్ముడు ఎన్టీఆర్‌ ‘ఆది’తో పెద్ద హిట్‌ అందుకున్నాడు. తన విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది’’ అని అన్నారు.



డైరెక్ట్‌గా మాట్లాడటమే ఇష్టం...

సోషల్‌ మీడియాకు నాకు కాస్త దూరం ఎక్కువ. అంతగా పట్టించుకోను. నాకు సోషల్‌ మీడియా అకౌంట్స్‌ కూడా లేవు. ఎవరితోనైనా మాట్లాడాలంటే డైరెక్ట్‌గా మాట్లాడతా. అదే నాకు ఇష్టం. మహేశ్‌–త్రివిక్రమ్‌ సినిమాలో నేను విలన్‌గా నటిస్తున్నా అని ఇటీవల ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేసింది. నా పేరుతో ఉన్న ఓ ఫేక్‌ ట్విటర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అందులో ఎలాంటి నిజమూ లేదు. నిజంగా అలాంటి అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా’’ అని తారకరత్న చెప్పారు. 


Updated Date - 2022-06-04T20:31:07+05:30 IST