Balakrishna: కొత్త హంగులతో తారకరామ థియేటర్‌!

ABN , First Publish Date - 2022-12-12T01:31:59+05:30 IST

హైదరాబాద్‌లో పురాతన థియేటర్‌ అయిన తారకరామ కొత్త హంగులతో పునఃప్రారంభం కానుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానుల నటుడు తారక రామారావుపై ఉన్న అభిమానంతో నిర్మాత నారాయణ్‌ కె దాస్‌ నారంగ్‌ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేస్తున్నారు

Balakrishna: కొత్త హంగులతో తారకరామ థియేటర్‌!

హైదరాబాద్‌లో పురాతన థియేటర్‌ అయిన తారకరామ(Taraka theatre Re open) కొత్త హంగులతో పునఃప్రారంభం  కానుంది. తెలుగు ప్రేక్షకుల అభిమానుల నటుడు తారక రామారావుపై ఉన్న అభిమానంతో నిర్మాత నారాయణ్‌ కె దాస్‌ నారంగ్‌ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేస్తున్నారు. తాజాగా ఆ పనులు పూర్తయ్యాయి. ‘ఏషియన్‌ తారకరామ’ పేరుతో  కొత్త టెక్నాలజీ, సౌండింగ్‌తో ఈ నెల 14న  నందమూరి బాలకృష్ణ (Bala krishna) రీ ఓపెన్‌ చేస్తున్నారు. 4కే ప్రొజెక్షన్‌, సుపీరియర్‌ సౌండ్‌ సిస్టమ్‌, 975 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెకే్ౖలనర్‌ సీటింగ్‌ ఏర్పాటు చేశారు. తొలి చిత్రంగా  ఈనెల 16న హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌ 2’ను ప్రదర్శించనున్నారు. 



Updated Date - 2022-12-12T01:31:59+05:30 IST