సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాల ‘తార’

ABN, First Publish Date - 2022-10-08T05:30:00+05:30

ఓ పదేళ్ల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో చిత్రపరిశ్రమకు వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ పదేళ్ల బాలిక సినిమా తార కావాలనే లక్ష్యంతో చిత్రపరిశ్రమకు వచ్చి ఎన్ని కష్టాలు అనుభవించింది, చివరకు తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకుంది.. అనే కథాంశంతో రూపుదిద్దుకునే ‘తార’ చిత్రం షూటింగ్‌ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మల్లిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ వెంకటరమణ పసుపులేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బేబి తుషార, , బేబి నాగహాసిని, సత్యకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత సాయివెంకట్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌ తొలి క్లాప్‌ ఇచ్చారు. గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 14 నుంచి ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్‌లో సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తామని దర్శకనిర్మాతలు చెప్పారు. మాస్టర్‌ హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: సాయిమల్లి అరుణ్‌ రామ్‌.

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!