సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Tammareddy Bharadwaja: ‘లైగర్‌’ మూవీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2022-09-01T18:46:19+05:30

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ (Liger) సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) ఇటీవల వచ్చిన ‘లైగర్‌’ (Liger) సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్‌ ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో లైగర్ మూవీతో పాటు కార్తికేయ 2, సీతారామం సినిమాల రిజల్ట్ గురించి మాట్లాడారు. 


‘లైగర్‌’ భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్‌గా నిలిచింది..దీనికి కారణాలు ఏమై ఉంటాయి..? అని యాంకర్ అడిగారు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ..‘ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడను. నాకు తెలీదు. నాకు పూరీ జగన్నాథ్‌ సినిమాలంటే చాలా ఇష్టం. నేను ఆయన అభిమానిని. కానీ, ‘లైగర్‌’ ట్రైలర్‌ చూసినప్పుడే ఎందుకో నాకు మూవీ చూడాలనిపించలేదు. తర్వాత చూడాలనిపిస్తే చూస్తా..అని చెప్పారు. 


సినిమా హిట్ అయినా ఫ్లాపయినా ఒకేలా ఉండాలి. విడుదలకి ముందు ఎగిరెగిరిపడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయి. అంతేకాదు, మన యాక్షన్‌పైనే ప్రేక్షకుల రియాక్షన్‌ కూడా ఆధారపడి ఉంటుంది.. అని తమ్మారెడ్డి అన్నారు. ‘సినిమా విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ ఎగిరెగిరిపడొద్దు. అలా చేస్తే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయి. ‘మేము ఎంతో కష్టపడి సినిమాని తీశాం..మీరు చూడండి’ అని ఎవరైనా తమ సినిమాని ప్రమోట్‌ చేసుకుంటే సరిపోతుంది. అంతేకానీ, నువ్వు చిటికెలు వేస్తే.. ప్రేక్షకులు ఇలాంటి సమాధానమే చెబుతారు’.. అని తమ్మారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2022-09-01T18:46:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!