Vignesh Shivan: నయనతారపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. కమిటీ ఏర్పాటు..

ABN , First Publish Date - 2022-10-14T00:39:59+05:30 IST

సెలబ్రిటీ దంపతులు నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు ప్రభుత్వ నిబంధనలను బ్రేక్ చేసి సరోగసీ విధానంలో కవలలకు

Vignesh Shivan: నయనతారపై చర్యలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం.. కమిటీ ఏర్పాటు..

సెలబ్రిటీ దంపతులు నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. ఈ దంపతులు ప్రభుత్వ నిబంధనలను బ్రేక్ చేసి సరోగసీ విధానంలో కవలలకు జన్మనిచ్చారనే వార్తలు బయటకు రావడం తీవ్ర వివాదస్పదం అయింది. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి  ఎమ్. సుబ్రమణియం కూడా ఈ వివాదంపై స్పందించారు. సమగ్ర దర్యాప్తు జరిపి నయనతారపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.  


సరోగసీ అంశంపై తమిళనాడు ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. నయన్ పిల్లలు పుట్టిన ఆస్పత్రి నుంచి దర్యాప్తును ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే నయన్, విఘ్నేశ్‌ల నుంచి వివరణ కోరే అవకాశం ఉందని సమాచారం. నయనతార, విఘ్నేశ్ శివన్‌ దాదాపు ఆరేళ్లు డేటింగ్ చేశారు. అనంతరం జాన్ 9న పెళ్లి చేసుకున్నారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లైన నాలుగు నెలలకే తమకు కవలలు జన్మించారని అక్టోబర్ 9న  విఘ్నేశ్‌ శివన్‌ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ జంట సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారనే వార్తలు బయటకు రావడం వివాదస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ వివాదంపై సోషల్ మీడియాలో పరోక్షంగా స్పందించాడు. ‘‘మన వెన్నంటే ఎల్లప్పుడు ఉండి, మన బాగోగులు చూసుకునేవారి అభిప్రాయాలను గౌరవించు. వారే మన గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్లే నీ వాళ్లు. ఎప్పటికి ఇదే వాస్తవం’’ అని విఘ్నేశ్ శివన్ చెప్పాడు. ‘‘సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్ని నీకు లభిస్తాయి. అంత వరకు సహనంతో ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకో’’ అని విఘ్నేశ్ తెలిపాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. నయనతార చివరగా ‘గాడ్ ఫాదర్’ లో నటించింది. చిరంజీవికి చెల్లెలిగా కనిపించింది. ‘కనెక్ట్’, ‘జవాన్’ వంటి ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.  




Updated Date - 2022-10-14T00:39:59+05:30 IST