తమిళ్ రాకర్స్ వస్తున్నారు
ABN, First Publish Date - 2022-08-13T06:20:54+05:30
సినిమా పైరసీ మాఫియా ముఠా తమిళ్ రాకర్స్ నెట్వర్క్ ఎలా పనిచేస్తోందనే అంశంతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘తమిళ్ రాకర్స్’.
సినిమా పైరసీ మాఫియా ముఠా తమిళ్ రాకర్స్ నెట్వర్క్ ఎలా పనిచేస్తోందనే అంశంతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘తమిళ్ రాకర్స్’. ఇందులో అరుణ్ విజయ్, వాణీ బోజన్ ప్రధాన పాత్రలు పోషించారు. అరివఝుగన్ దర్శకత్వంలో అరుణ గుహ నిర్మించారు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ విజయ్ మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమ కష్టం పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. అరివఝుగన్ చాలా అద్భుతంగా ఈ సిరీస్‌ను రూపొందించారు’ అన్నారు. అరివఝుగన్ మాట్లాడుతూ ‘చిత్ర పరిశ్రమకు ప్రమాదకరంగా మారిన తమిళ్‌రాకర్స్ ఎలా పైరసీ చేస్తున్నారనే అంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కించాం’ అన్నారు. ఏవీఎం సంస్థ తొలిసారి నిర్మించిన సిరీస్ ఇదని అరుణ గుహ చెప్పారు. ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుభూతిని పంచుతుందని వాణీ బోజన్ తెలిపారు.