Tamannaah Bhatia: పెళ్లి వదంతులకు చెక్.. బిజినెస్ మ్యాన్ భర్తను చూపించిన అందాల భామ..
ABN , First Publish Date - 2022-11-17T01:50:39+05:30 IST
తమన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. పెళ్లి వదంతులకు చెక్ పెట్టింది.

చిన్నతనంలోనే ఇండస్ట్రీకి ఎంట్రీ స్టార్ హీరోయిన్‌గా మారిన అందాల భామ తమన్నా భాటియా (Tamannaah Bhatia). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో నటించింది. సినిమాల్లో 15ఏళ్లుగా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ‘హ్యాపీడేస్’ (Happy Days) తో టాలీవుడ్‌లో బంపర్ హిట్ కొట్టింది. ‘100%లవ్’, ‘బాహుబలి’, ‘ఊపిరి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. హీరోయిన్స్ అందరు ఒక్కొక్కరుగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుంది. హన్సిక మోత్వానీ డిసెంబర్ 4న సోహైల్ కతురియాను వివాహం ఆడనుంది. అదే బాటలో నడుస్తూ తమన్నా కూడా పెళ్లి చేసుకొబోతుందని రూమర్స్ షికార్లు కొట్టాయి. ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్‌ను ఆమె వివాహం ఆడనుందని కొన్ని రోజులుగా వదంతులు హల్‌చల్ చేశాయి. తమన్నా నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని పలు వెబ్‌సైట్స్ రాశాయి. ఈ నేపథ్యంలో తమన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. పెళ్లి వదంతులకు చెక్ పెట్టింది.
‘ఎఫ్ 3’ సినిమాలో తమన్నా ఓ పాటలో డ్యూయల్ రోల్ చేసింది. పురుషుడి వేషధారణలో కనిపించింది. ఆ ఫొటోను నెటిజన్స్‌తో పంచుకుంటూ.. నా బిజినెస్ మ్యాన్ భర్తను చూడండి అంటూ పిక్‌ను షేర్ చేసింది. అంతకు ముందు కూడా తమన్నా ఓ పోస్ట్ పెట్టింది. పెళ్లి నిజమేనా అంటూ ప్రశ్నించింది. తాజాగా ఆమె నుంచి ‘ఎఫ్ 3’, ‘ప్లాన్ ఏ, ప్లాన్ బీ’, ‘బబ్లీ బౌన్సర్’ వంటి సినిమాలు వచ్చాయి. ‘భోళా శంకర్’, ‘గుర్తుందా శీతాకాలం’ వంటి మరికొన్ని ప్రాజెక్టులు తమన్నా చేతిలో ఉన్నాయి. ఈ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.