Taapsee: తాప్సీ కూడా మొదలుపెట్టింది!

ABN , First Publish Date - 2022-05-17T14:37:18+05:30 IST

సాదాసీదా కథలతో కెరీర్‌ మొదలుపెట్టిన తాప్సీ... ఇప్పుడు కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను చూసిన పరాజయాలే తనలో మార్పునకు కారణం అని తరచూ చెబుతుంటారామె! ఇప్పుడు తాప్సీ అంటే బలమైన కథలకు కేరాఫ్‌గా నిలిచారు. కెరీర్‌ మొదలుపెట్టిన టాలీవుడ్‌ కన్నా బాలీవుడ్‌లో నటిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ.

Taapsee: తాప్సీ కూడా మొదలుపెట్టింది!

సాదాసీదా కథలతో కెరీర్‌ మొదలుపెట్టిన తాప్సీ(Taapsee)... ఇప్పుడు కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తను చూసిన పరాజయాలే తనలో మార్పునకు కారణం అని తరచూ చెబుతుంటారామె! ఇప్పుడు తాప్సీ అంటే బలమైన కథలకు కేరాఫ్‌గా నిలిచారు. కెరీర్‌ మొదలుపెట్టిన టాలీవుడ్‌ కన్నా బాలీవుడ్‌లో నటిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. ‘నామ్‌ షబానా’, ‘ముల్క్‌’ ‘హసీనా దిల్‌రుబా’, ‘బద్లా’, ‘లూప్‌ లపేట’ వంటి భిన్న మైన కథలతో పేరు సంపాదించారు. ఇప్పుడామె నిర్మాతగానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ‘ఔట్‌సైడర్స్‌ ఫిల్మ్స్‌’(outsiders films) అనే ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించి, ‘బ్లర్‌’(Blur) చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది పాత విషయమే.! కానీ ఇప్పుడు ఇతర నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో కూడా సినిమాలు తీస్తున్నట్లు చెప్పారు.


తాజాగా మరో భారీ ప్రాజెక్ట్‌లతో తాప్సీ భాగమయ్యారు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, బీఎల్‌ఎమ్‌ పిక్చర్స్‌తో కలిసి ‘ధక్‌ ధక్‌’ చిత్రాన్ని నిర్మిస్తునట్లు తాప్సీ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను  సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. తరుణ్‌ దుదేజా దర్శకత్వం వహిస్తున్నారు. తాము కోరుకున్న స్వేచ్ఛను పొందిన నలుగురు మహిళల కథ ఇదని ఆయన తెలిపారు. ఫాతిమా సనా షేక్‌, రత్న పాఠక్‌, దియా మీర్జా, సంజనా సంఘీ కీలక పాత్రధారులు. 




Updated Date - 2022-05-17T14:37:18+05:30 IST

Read more