సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రేమలో సస్పెన్స్‌

ABN, First Publish Date - 2022-10-08T05:30:00+05:30

చైతన్య పసుపులేటి, రితికా చక్రవర్తి జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొనే చిత్రం షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైతన్య పసుపులేటి, రితికా చక్రవర్తి జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకొనే చిత్రం షూటింగ్‌ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రావు బోయపాటి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, హీరో ఆకాశ్‌ పూరి తొలి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు  చిన్న వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘ ఇదొక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. లవ్‌, ఫ్యామిలీ సెంటిమెంట్‌ అంశాలు కూడా ఉన్నాయి. ఈ నెల 17న చీరాలలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌తో చిత్రం పూర్తవుతుంది’ అని తెలిపారు. శివకుమార్‌ రామచంద్రవరపు, కిరణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: స్వరూప్‌, హర్ష, తమిళ సమర్పకుడు: సాయి కార్తిక్‌  గౌడ్‌, జాడి, ఛాయాగ్రహణం: సుధాకర్‌ అక్కినపల్లి. నిర్మాత: వి.శ్రీనివాసరావు.

Updated Date - 2022-10-08T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!