ప్రతి అమ్మాయికి అలాంటోడు ఒకడు ఉండాలి: సుప్రీత
ABN, First Publish Date - 2022-01-18T20:19:11+05:30
నటి సురేఖావాణికీ, తన గారాల కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పొట్టి దుస్తుల్లో తల్లితోపాటు కూతురు కూడా ఇన్‌స్టాలో రచ్చ చేస్తుంటారు. ఆ ఫొటోలు, వీడియోలో వైరల్ అయ్యి, ట్రోలింగ్ వరకూ వెళ్తాయి. అయినా ఇద్దరూ ఏమాత్రం తగ్గరు.. రెట్టింపు ఉత్సాహంతో మరో వీడియో చేస్తారు.
నటి సురేఖావాణికీ, తన గారాల కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. పొట్టి దుస్తుల్లో తల్లితోపాటు కూతురు కూడా ఇన్‌స్టాలో రచ్చ చేస్తుంటారు. ఆ ఫొటోలు, వీడియోలో వైరల్ అయ్యి, ట్రోలింగ్ వరకూ వెళ్తాయి. అయినా ఇద్దరూ ఏమాత్రం తగ్గరు.. రెట్టింపు ఉత్సాహంతో మరో వీడియో చేస్తారు. ఇటీవల సుప్రీత ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటించింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మతిపోయే కౌంటర్ ఇచ్చింది. సురిపీత ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలో అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఉన్న నందు గురించి నెటిజన్ ‘నందు నీకేం అవుతాడు. బాయ్ ఫ్రెండా? బాయ్స్‌లో బెస్టీనా? అని అడిగారు. దానికి సుప్రీత ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఒకడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం ేస్నహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్ ఫ్రెండ్స్’ అని సమాధానమిచ్చింది. సుప్రీతకు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉంది. ఆ దిశగా తన తల్లి సురేఖావాణి ప్రయత్నాలు చేస్తోంది.