Dejavu: ఓటీటీ వీక్షకులను ఆకర్షిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్
ABN , First Publish Date - 2022-11-25T16:11:57+05:30 IST
కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’ (Dejavu) సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం..

కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’ (Dejavu) సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. అరుల్‌నిథి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మిమే గోపి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కి అరవింద్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఊహించని మలుపులతో ఈ చిత్రం తెరకెక్కిన తీరు ఓటీటీ వీక్షకులను బాగా ఆకర్షిస్తోంది. ఫలితంగా ఓటీటీలో ఈ చిత్రం భారీ స్పందనను రాబట్టుకుంటోంది. (Superb Response to Dejavu in Amazon Prime Video)
ఒక నవలా రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏమి జరుగుతుంది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమి జరుగుతుంది?.. అనేదే ‘డెజావు’ చిత్రం. ఈ కథలో పోలీసు ఇన్వెష్టిగేషన్ ప్రారంభం కావడం, హత్యలు, ఇతర ఘోరమైన ఘటనలు చోటుచేసుకోవడం.. చిత్రంపై ఉత్కంఠను తారాస్థాయికి చేరుస్తుంది. చివరి వరకు కూడా దర్శకుడు ఈ చిత్రాన్ని సస్పెన్స్‌తో నడిపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 2022 జూలైలో తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుని.. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులని ఆకర్షించిన ఈ చిత్రాన్ని తెలుగులో భవాని DVD ఇంక్‌పై రాజశేఖర్ అన్నభీమోజు (Rajasekhar Annabhimoju) విడుదల చేశారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం, పీజీ ముత్తయ్య సినిమాటోగ్రఫీ అందించారు.
Read more