మంచు విష్ణుకి గుణపాఠం చెప్పిన Sunny Leone, పాయల్ రాజ్‪పుత్

ABN , First Publish Date - 2022-05-12T05:23:21+05:30 IST

మంచు విష్ణుకి సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ గుణపాఠం చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే కింది మ్యాటర్ చదవాల్సిందే. మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ కలిసి ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్‌బాబు

మంచు విష్ణుకి గుణపాఠం చెప్పిన Sunny Leone, పాయల్ రాజ్‪పుత్

మంచు విష్ణు (Manchu Vishnu)కి సన్నీలియోన్ (Sunny Leone), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) గుణపాఠం చెప్పడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే కింది మ్యాటర్ చదవాల్సిందే. మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ కలిసి ఈషాన్ సూర్య (Ishan Surya) దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. మంచు మోహన్‌బాబు (Manchu MohanBabu) ఆశీస్సులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అవ ఎంటర్‌టైన్‌మెంట్ (AVA Entertainment) బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆ విషయం మంచు విష్ణు, సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వీడియోలను చూస్తుంటే అర్థమవుతుంది. ఇటీవల చిన్న పిల్లల ఆటలాడుతూ.. మంచు విష్ణు, సన్నీలియోన్ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సినిమాపై ఇంట్రస్ట్‌ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. 


ఈ వీడియోలో.. ముందుగా మంచు విష్ణు నడుచుకుంటూ వస్తుండగా.. పక్కన పాయల్ రాజ్‌పుత్ కూర్చుని ఉంది. అప్పుడు మంచు విష్ణుని ‘మీ ఫేవరేట్ ఎవరు?’ అని పక్కన ఓ వాయిస్ అడిగింది. దీనికి మంచు విష్ణు ‘ఇంకెవరు పాయల్.. ఆమే నా ఫేవరేట్’ అని సమాధానమిచ్చారు. కాసేపటి తర్వాత సన్నీలియోన్ కూర్చుని ఉండగా.. పక్కన కూర్చుని ఉన్న విష్ణుని సేమ్ క్వశ్చన్ అడగగా.. ‘ఇంకెవరు.. సన్నీనే’ అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కూర్చుని ఉన్నప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ చేయగా.. కాసేపు ఆలోచించిన మంచు విష్ణు.. ‘ఆలియా భట్’ (Alia Bhatt) అని చెప్పారు. దీంతో పక్కనున్న ఇద్దరు నటీమణులు మంచు విష్ణుని బాదేశారు.. అదే గుణపాఠం చెప్పారు. ఈ వీడియోని పోస్ట్ చేసిన సన్నీలియోన్.. ‘విష్ణుకి నేను, పాయల్ రాజ్‌పుత్ తగిన గుణపాఠం చెప్పాము’ అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో మంచు విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ (Gali Nageswara Rao) పాత్రలో నటిస్తున్నారు. సన్నీలియోన్ రేణుక(Renuka)గా, పాయల్ రాజ్‌పుత్ స్వాతి(Swathi)గా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లేని కోన వెంకట్ (Kona Venkat) అందిస్తున్నారు. అంతేకాదు, ఆయన ఈ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా (Prabhu Deva) కొరియోగ్రఫీలో మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్‌పై రామోజీ ఫిలిం సిటీలో ఓ పాటను చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు.Updated Date - 2022-05-12T05:23:21+05:30 IST

Read more