‘ఊరు పేరు భైరవకోన’: ఫాంటసీ వరల్డ్‪లోకి తీసుకెళుతోన్న Sundeep Kishan

ABN , First Publish Date - 2022-05-08T02:39:33+05:30 IST

యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా.. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలని రూపొందించే దర్శకుడు విఐ ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో.. డిఫరెంట్ ఫాంటసీ మూవీగా ఓ చిత్రం

‘ఊరు పేరు భైరవకోన’: ఫాంటసీ వరల్డ్‪లోకి తీసుకెళుతోన్న Sundeep Kishan

యంగ్ హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరోగా.. వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలని రూపొందించే దర్శకుడు విఐ ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో.. డిఫరెంట్ ఫాంటసీ మూవీగా ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) బ్యానర్‌పై అనిల్ సుంకర (Anil Sunkara) సమర్పణలో, సందీప్ కిషన్ 28వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ (Hasya Movies ) బ్యానర్‌పై రాజేష్ దండా (Razesh Danda) నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా(Balaji Gutta) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా హీరో సందీప్ కిషన్ పుట్టినరోజును పురస్కరించుకుని..  సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు 


సందీప్ కిషన్‪కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‪లో ఒక ఫాంటసీ (Fantasy) ప్రపంచాన్ని చూపించారు. ఈ లుక్‪లో సందీప్ కిషన్ తన చేతిలో మంత్రదండంతో కనిపిస్తుండగా.. అతనికి సమీపంలో చంద్రుడు పెద్దగా కనిపిస్తూ మిగతా కట్టడాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. ఫాంటసీ ప్రపంచం కళ్ళకు కట్టినట్లు ఉన్న ఈ పోస్టర్‪తో దర్శకుడు విఐ ఆనంద్ తన మార్క్ ని చూపించి ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచారు. సందీప్ కిషన్ లుక్‪తో పాటు మేకింగ్ వీడియో విజువల్స్ గ్రిప్పింగ్‪గా ఉన్నాయి. శరీరం నిండా మంటలతో ఓ వ్యక్తి నీళ్ళలోకి దూకుతున్న సీక్వెన్స్ టెర్రిఫిక్‪గా వుంది. మేకింగ్ వీడియోలో వినిపించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా ఉంది. కాగా, సందీప్ కిషన్ సరసన కావ్య థాపర్ (Kavya Thapar), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతం సమకూరుస్తున్నారు.Updated Date - 2022-05-08T02:39:33+05:30 IST

Read more