18న ఆది - నిక్కీ గల్రానీ వివాహం

ABN , First Publish Date - 2022-05-08T05:53:15+05:30 IST

తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల్లో నటుడుగా, విలన్‌గా రాణిస్తున్న నటుడు ఆది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు....

18న ఆది - నిక్కీ గల్రానీ వివాహం

తమిళ, తెలుగు చిత్రపరిశ్రమల్లో నటుడుగా, విలన్‌గా రాణిస్తున్న నటుడు ఆది త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల ఈయన నటించిన ‘క్లాప్‌’ చిత్రం మంచి సక్సెస్‌ సాధించింది. ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. ఆయన నిక్కీ గల్రానీని వివాహమాడనున్నారు. వీరి వివాహం ఈ నెల 18వ తేదీన చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. ఈ వివాహం ఆది కుటుంబ సంప్రదాయం ప్రకారం జరుగనుంది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, దగ్గరి బంధువులు మాత్రమే హాజరుకానున్నారు. అదే రోజు సాయంత్ర రిసెప్షన్‌ జరుగనుంది. కాగా వీరిద్దరికి మార్చి 24వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే.

ఆంధ్రజ్యోతి, చెన్నై 


Updated Date - 2022-05-08T05:53:15+05:30 IST

Read more