సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sumanth: కొత్త చిత్రానికి శ్రీకారం.. డైరెక్టర్‌ రిపీట్‌!

ABN, First Publish Date - 2022-07-04T01:22:04+05:30

సుమంత్‌ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘లక్ష్య’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న సంతోష్‌ జాగర్లపూడి ఈ చిత్రానికి దర్శకుడు. కేఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.ప్రదీప్‌ నిర్మిస్తున్నారు. సుమంత్‌–సంతోష్‌ కాంబినేషన్‌లో గతంలో విడుదలైన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ హిట్‌ కాంబినేషన్‌లో తాజా చిత్రాన్ని నిర్మాత ఆదివారం ప్రకటించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుమంత్‌ (Sumanth)ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. ‘సుబ్రహ్మణ్యపురం’, ‘లక్ష్య’ చిత్రాలతో దర్శకుడిగా నిరూపించుకున్న సంతోష్‌ జాగర్లపూడి (Santhosh jagarlapudi)ఈ చిత్రానికి దర్శకుడు. కేఆర్‌ క్రియేషన్స్‌ పతాకంపై కె.ప్రదీప్‌ నిర్మిస్తున్నారు. సుమంత్‌–సంతోష్‌ కాంబినేషన్‌లో గతంలో విడుదలైన ‘‘సుబ్రహ్మణ్యపురం’’ సినిమా మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ హిట్‌ కాంబినేషన్‌లో తాజా చిత్రాన్ని నిర్మాత ఆదివారం ప్రకటించారు. 


‘‘పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్‌కు గురిచేేస అంశాలతో ఉంటుంది’’ అని దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి చెప్పారు. ‘‘ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుందని,  నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని  నిర్మాత చెప్పారు. (Sumanth announced new movie) 




Updated Date - 2022-07-04T01:22:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!