Vaaraahi: ‘సుబ్రహ్మణ్యపురం’ కాంబో రిపీట్..

ABN , First Publish Date - 2022-11-15T03:41:19+05:30 IST

‘వారాహి’ (Vaaraahi) అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో ‘వారాహి’ ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి

Vaaraahi: ‘సుబ్రహ్మణ్యపురం’ కాంబో రిపీట్..

‘వారాహి’ (Vaaraahi) అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో ‘వారాహి’ ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్ (Sumanth) హీరోగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Santhossh Jagarlapudi). వీరి కాంబినేషన్‌లో గతంలో ‘సుబ్రహ్మణ్యపురం’ (Subrahmanyapuram) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకున్న నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ‘వారాహి’పై అప్పుడే ఆసక్తి మొదలవుతోంది. ఈ చిత్రాన్ని జీకే మూవీ మేకర్స్ పతాకంపై రమాదేవి నారగాని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. దర్శకుడు వివి వినాయక్ (VV Vinayak) ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డివోషనల్ బేస్డ్ మూవీగా ఓ సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపారు. (Vaaraahi Movie Launch)


ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ... మా సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. సప్త మాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.. అని తెలిపారు. హీరో సుమంత్ మాట్లాడుతూ... సంతోష్ ఈ కథ చెప్పగానే క్లాప్స్ కొట్టాను. భారీ ఎత్తున ఈ సినిమా చేయబోతున్నాం. మా కాంబినేషన్‌లో వచ్చిన ‘సుబ్రహ్మణ్యపురం’ కంటే చాలా బెటర్ స్క్రిప్ట్ ఇది. ఇటీవల కాంతార (Kantara), కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి ఒక డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్‌గా ‘వారాహి’ ఆకట్టుకుంటుందని అన్నారు.

Updated Date - 2022-11-15T03:41:19+05:30 IST