Sumanth Ashwin: నాన్న ఫైర్‌లో ఉన్నారు... 2.0 అనుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-06-19T00:43:24+05:30 IST

‘‘నువ్వొస్త్తానంటే నేనొద్దంటానా’ తర్వాత నాన్న ఆలోచన మారి ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్‌ గేమ్‌... ఫ్యామిలీ, టార్గెట్‌ ఆడియన్స్‌’ అంటూ రకరకాల ఆలోచనలతో చేసిన సినిమాలు కథ పరంగా నిరాశ పరచి ఉండొచ్చు. ఇప్పుడు అవన్నీ వదిలేసి నాన్న కంప్లీట్‌ అప్‌ గ్రేడ్‌ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనలో మంచి ఫైర్‌ ఉంది. ఆయన్ను ఎమ్మెస్‌ రాజు 2.0 అనుకోవచ్చు’’ అని సుమంత్‌ అశ్విన్‌ అన్నారు.

Sumanth Ashwin: నాన్న ఫైర్‌లో ఉన్నారు... 2.0 అనుకోవచ్చు!

‘‘నువ్వొస్త్తానంటే నేనొద్దంటానా’ తర్వాత నాన్న ఆలోచన మారి ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్‌ గేమ్‌... ఫ్యామిలీ, టార్గెట్‌ ఆడియన్స్‌’ అంటూ రకరకాల ఆలోచనలతో చేసిన సినిమాలు కథ పరంగా నిరాశ పరచి ఉండొచ్చు. ఇప్పుడు అవన్నీ వదిలేసి నాన్న కంప్లీట్‌ అప్‌ గ్రేడ్‌ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయనలో మంచి ఫైర్‌ ఉంది. ఆయన్ను ఎమ్మెస్‌ రాజు 2.0 అనుకోవచ్చు’’ అని సుమంత్‌ అశ్విన్‌ అన్నారు. ఎమ్మెస్‌ రాజు దర్శకత్వం వహించిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రం నిర్మించడంతోపాటు ఓ హీరోగా కూడా నటించారు. రజనీకాంత్‌.ఎస్‌ మరో నిర్మాత. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన సుమంత్‌ అశ్విన్‌ విలేకర్లతో మాట్లాడారు. (Sumanth ashwin interview)


నటుడిగా నా తొలి చిత్రం ‘తూనీగ తూనీగ’ విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ జర్నీలో సక్సెస్‌ ఫుల్‌ సినిమాలు ఉన్నాయి. నిరుత్సాహపరిచిన చిత్రాలూ ఉన్నాయి. అయితే, ఈ జర్నీ చాలా అందంగా ఉంది. పదేళ్ల కాలం తెలియకుండా చాలా వేగంగా గడిచిపోయింది. ఇకపై చేసిన పాత్రలు కాకుండా కొత్తగా ముందుకెళ్లాలనుకుంటున్నా. తాజాగా చేసిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’ చిత్రం ఆ తరహాకు చెందినదే! ఇంతకు ముందు చేసినవి లార్జర్‌ దేన్‌ లైఫ్‌ రోల్స్‌. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాలో నా పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పటికీ... కొన్ని అంశాలు లార్జర్‌ దేన్‌ లైఫ్‌ ఎలిమెంట్‌ ఉంటాయి. ‘7 డేస్‌ 6 నైట్స్‌’లో రియాలిటీకి దగ్గరగా ఉన్న రోల్‌ చేశా. ఇప్పుడు ప్రేక్షకులు కొత్తని ఆస్వాదిస్తున్నారు. వారి అభిరుచి మేరకే ఆర్టిస్ట్‌ చేసుకు వెళ్లాలి. కరోనా వల్ల కావచ్చు.. ఓటీటీ అప్‌డేట్‌ కావడం వల్ల కావచ్చు ప్రేక్షకులు వరల్డ్‌ సినిమా రుచి చూశారు. వాళ్లను రీచ్‌ కావాలంటే మేకర్స్‌ ఆలోచన నెక్ట్స్‌ లెవల్లో ఉండాలి. నేను ఇప్పుడు అదే దారిలో ఉన్నా. (Ms raju)


ఈ చిత్రంలో యంగ్‌స్టర్‌గా కనిపిస్తా. ఫిల్మ్‌ మేకర్‌ కావాలనేది అతని కోరిక. జీవితంలో తనకు చాలా ప్రాబ్లమ్స్‌ ఉంటాయి. స్ట్రగుల్‌ అవుతూ ఉంటాడు. కెరీర్‌ మీద కేర్‌ లేని వ్యక్తి. అటువంటి మనిషి ఎలా ఉంటాడో... నా లుక్‌ కూడా అలాగే ఉంటుంది. రోహన్‌, మెహర్‌ కూడా బాగా చేశారు. 


నాన్న ఎంతోమందికి మంచి సినిమాలిచ్చారు. ఇప్పుడు నన్ను ఎలివేట్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకు ఆయనకు మంచి గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నా. కానీ ఆయనే నాకు గిప్ట్‌ ఇచ్చారు. ‘7 డేస్‌ 6 నైట్స్‌’ కాపీ చూపించారు. సినిమా చాలా బావుంది. రెండు వారాల తర్వాత కూడా సినిమా గురించి మాట్లాడుకుంటారు. మరో జన్మంటూ ఉంటే మళ్లీ ‘ఎమ్మెస్‌ రాజుగారికే కొడుకుగా పుట్టాలని దేవుణ్ణి కోరుకుంటా. నేను ఏది అడిగితే అది ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా ఆ దంపతులకే కొడుకుగా పుట్టాలి. 


ఈ సినిమాకు నాన్న దర్శకుడు కావడం, కథ నచ్చడం రెండు కారణాలతో సినిమా చేశా. ఇప్పుడు నాన్నని ఎంఎస్‌ రాజు 2.0 అనుకోవచ్చు. ‘డర్టీ హరి’తో ఆయన ప్రూవ్‌ చేసుకున్నారు. ‘నువ్వొస్త్తానంటే నేనొద్దంటానా’ తర్వాత మధ్యలో ఎక్కడో ‘ప్రేక్షకులకు ఏం కావాలో అదే ఇవ్వాలి. సేఫ్‌ గేమ్‌... ఫ్యామిలీ, టార్గెట్‌ ఆడియన్స్‌’ అంటూ చేసిన సినిమాలు కథ పరంగా నిరాశ పరచి ఉండొచ్చు. ఇప్పుడు అవన్నీ వదిలేసి నాన్నగారు కంప్లీట్‌ అప్‌ గ్రేడ్‌ అయ్యి సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నాన్నగారి మార్కు కనిపిస్తుంది. అదే సమయంలో 20 ఏళ్ళ దర్శకుడు తీసినట్టు ఉంటుంది. 


సినిమా ఫస్ట్‌ కాపీ చూశా. అప్పుడు నాతోపాటు అమ్మ, సోదరి కూడా ఉన్నారు. ఇందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. అలాంటి సన్నివేశాలుంటే వాళ్ళతో కలిసి చూడలేం. యువత అడల్ట్‌ కంటెంట్‌ కోసం థియేటర్లకు రావాల్సిన అవసరం లేదు. ఎవరూ రారు కూడా! ఇంటర్నెట్‌లో బోలెడు కంటెంట్‌ ఉంది. కథ ఉంటేనే ఎవరైనా థియేటర్లకు వస్తారు. (Sumanth ashwin interview)


‘డర్టీ హరి’తో నిర్మాతలకు మంచి లాభాలొచ్చాయి. దాని తర్వాత ఏ సినిమా చేయాలని నాన్న ఆలోచిస్తున్నారు. ఆయన దగ్గర ఆరేడు కథలున్నాయి. అందులో ఇది చేద్దామని అనుకున్నప్పుడు... నేను ప్రొడ్యూస్‌ చేయాలనుకున్నా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఇండస్ర్టీలో చాలా మంది దర్శక, నిర్మాతలు నాన్నగారిని హానీ అని పిలుస్తారు. ‘డర్టీ హరి’, ఈ కథను చూస్తే నాన్నగారు వైల్డ్‌గా అనిపించారు. అందుకని‘వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌’ అని పేరు పెట్టా. (Sumanth ashwin interview)


Updated Date - 2022-06-19T00:43:24+05:30 IST

Read more