సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఏపీ సీఎంతో మీటింగ్‌కి నన్నెవరూ పిలవలేదు: సుమన్

ABN, First Publish Date - 2022-03-05T22:36:09+05:30

ఇటీవల చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీ సీఎంను కొందరు సినీ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు మరికొందరు సీఎం జగన్‌తో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి ఏపీ సీఎంను కొందరు సినీ పెద్దలు కలిసిన విషయం తెలిసిందే. అందులో మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్‌తో పాటు మరికొందరు సీఎం జగన్‌తో సమావేశమైనవారిలో ఉన్నారు. అయితే ఈ సమావేశానికి ముందు చిరంజీవిని ఒక్కడినే సీఎం జగన్ ఆహ్వానించి, పరిశ్రమ గురించి మాట్లాడారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఒక ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి ఒక్కడే వెళ్లడం ఏమిటి? అని చాలా మంది మీడియా ముఖంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అందులో నటుడు సుమన్ కూడా ఉన్నారు. ఇప్పుడిదే విషయంపై సుమన్ ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘44 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్నాను. సీఎంతో మీటింగ్‌కు నన్నెవరూ పిలవలేదు. పిలిస్తే తప్పకుండా వెళ్లేవాడిని. అక్కడికి వెళ్లినా, వెళ్లకపోయినా నా ఆవేదన మాత్రం బయర్స్ గురించే. ఒకప్పుడు పెద్ద పెద్ద కార్లలో తిరిగిన బయ్యర్స్.. ఈ రోజు నీచమైన స్థితిలో చనిపోతుండటం నేను గమనించాను. చనిపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న ఓ ఐదారుగురు బయ్యర్స్‌ని నేను దగ్గరుండి దహన సంస్కారాలు చేయడం జరిగింది. ఎందుకు ‘బయ్యర్స్’ గురించి ఆలోచించడం లేదు. బయ్యర్స్ లేకపోతే సినిమా జాడే ఉండదు. బయ్యర్స్‌ని కాపాడుకోలేకపోతే సినిమా ఉనికినే కోల్పోతారు. అందుకే ‘బయ్యర్స్’ విషయంలో చాలా గిల్టీగా అనిపిస్తుంది. సినిమా కొనే ముందు మాత్రం షో వేసి హడావుడి చేసేవాళ్లు.. కొన్న తర్వాత అతనిని ఎందుకు పట్టించుకోవడం లేదు. సినిమా ఆడకపోతే అతని పరిస్థితి ఏమిటి? అతని ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? పెళ్లాం, పిల్లలు ఏమైపోతారో? అనే ఆలోచనే లేదు. దీనిని ఎలా పరిష్కరించాలి అనే ఆలోచనే లేదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ‘బయ్యర్స్’ ఉండరు. వాళ్లు లేకపోతే నిర్మాతలే సినిమాలు విడుదల చేసుకోవాలి. వరసగా మూడు నాలుగు సినిమాలు ఆడకపోతే.. నిర్మాతలది కూడా అప్పుడు అదే పరిస్థితి. ఆ తర్వాత హీరోహీరోయిన్లే వారి సినిమాలను విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. వారి గురించే నా ఆవేదన, వాదన. సీఎం దగ్గరకి వెళ్లినా నేను దీని గురించే మాట్లాడేవాడిని. కానీ నాకు ఆ అవకాశం రాలేదు. నన్నెవరూ పిలవలేదు. సినిమా కొన్న బయ్యర్.. ఆ సినిమా సరిగా ఆడకపోతే.. ఆ సినిమా వాళ్లంతా కూర్చుని ఏం చేద్దాం అని ఎందుకు ఆలోచించడం లేదు. ఆ బయ్యర్‌ని బతికించాలని ఎందుకు అనుకోవడం లేదు. రూ. 100 తీసుకున్నవాళ్లు.. సినిమా ఆడకపోతే రూ. 80 లేదంటే రూ. 90 తీసుకుని.. కొంతలో కొంతైనా ఆ బయ్యర్‌కి సాయం చేయవచ్చు కదా అనేది నాకున్న ఆలోచన. సినిమా ఇండస్ట్రీలో అందరూ బాగున్నారు అని అంతా అనుకుంటూ ఉంటారు. అది నిజం కానే కాదు. నా వరకు సినిమా కొనే బయ్యర్ బాగుంటే అందరూ బాగుంటారు..’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-03-05T22:36:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!