Ram Charan: సాబు సిరిల్ వైరల్ కామెంట్స్.. రామ్ చరణ్‌తో సుకుమార్‌ సినిమా..

ABN , First Publish Date - 2022-11-02T22:50:17+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘మగధీర’ (Magadheera) తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘రంగస్థలం’

Ram Charan: సాబు సిరిల్ వైరల్ కామెంట్స్.. రామ్ చరణ్‌తో సుకుమార్‌ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan). ‘మగధీర’ (Magadheera) తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ‘రంగస్థలం’ (Rangasthalam) లో సౌండ్ ఇంజినీర్‌ పాత్రతో ఆల్‌టై‌మ్ బ్లాక్ బ్లాస్టర్‌ను అందుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR)తో దేశంలోని ప్రేక్షకులందరికి చేరువయ్యాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాల మీద ఉంది. 70శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. అందువల్ల మెగా పవర్ స్టార్ తర్వాతి చిత్రంపై దృష్టి సారించాడు. వరుసగా కథలను వింటున్నాడు. 


‘జెర్సీ’ ఫేం గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమా చేయాలనుకున్నాడు. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత చెర్రీ క్రేజ్ అమాంతం మారిపోయింది. అందువల్ల ఈ ప్రాజెక్టు ఆటకెక్కింది. ఇదిలా ఉండగానే.. రామ్ చరణ్, సుకుమార్ (Sukumar) కలసి ఓ చిత్రం చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొంత భాగాన్ని షూట్ చేశారట. ఈ విషయాన్ని ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ (Sabu Cyril) మీడియాకు చెప్పాడు. ‘‘ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందే సుకుమార్, రామ్ చరణ్ కలసి షూటింగ్‌ను ప్రారంభించారు. 10నిమిషాల ఫుటేజ్ ఇప్పటికే సిద్ధమైంది. ప్రస్తుతం సుక్కు ..సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ కోసం అదే బాడీ షేప్ కావాలంటున్నాడు’’ అని సాబు సిరిల్ తెలిపాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఈ సీక్వెన్స్ గురించి రాజమౌళి కూడా మాట్లాడాడు. ‘‘ఒపెనింగ్ సీక్వెన్స్ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. ఆ సీన్ గురించి నేను బయటికి చెబితే సుకుమార్‌కు గుండె పోటు వస్తుంది’’ అని రాజమౌళి చెప్పాడు. సుకుమార్, రామ్ చరణ్ కలసి మరోసారి సినిమా చేస్తుండటంతో అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ‘ఆర్‌సీ-16’ గా ఈ చిత్రం తెరకెక్కుతుందా లేదా మరో ప్రాజెక్టు కోసం కలసి పనిచేయనున్నారా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.  

Updated Date - 2022-11-02T22:50:17+05:30 IST