ఈ టీజర్ గురించి మీకు చెప్పాలి!
ABN , First Publish Date - 2022-01-23T08:07:45+05:30 IST
సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.
సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకుడు. బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మాతలు. శనివారం టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ సూపర్ హిట్ చిత్రాల దర్శకుడి పాత్రలో కనిపించ నున్నారు. డాక్టర్ అలేఖ్యగా కృతి నటించింది. వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమకథే... ఈ చిత్రం. ‘‘ఓ దర్శకుడికీ, ఓ డాక్టర్‌కీ మధ్య జరిగే ప్రేమకథ ఇది. భిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎలా కలిశారు? వాళ్ల మధ్య ఏం జరిగిందన్నదే కథ. టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని నిర్మాతలు తెలిపారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్.