వరుణ్‌తో అలాంటి సినిమా తీయాలనుంది: అల్లు అరవింద్

ABN , First Publish Date - 2022-04-03T21:10:38+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'గని'. ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా మారారు.

వరుణ్‌తో అలాంటి సినిమా తీయాలనుంది: అల్లు అరవింద్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'గని'. ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా మారారు. సిద్దు ముద్దతో కలిసి బాబి నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 8న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం వైజాగ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కూడా హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ వచ్చింది. కరోనా కారణంగా సెట్లు వేయడం.. తీయడం వల్ల నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఖర్చు అయింది. అయినా కూడా ఈ నిర్మాతలు ఏ రోజూ డీలా పడకుండా సినిమాను పూర్తి చేశారు. మొత్తానికి థియేటర్స్‌లో గ్రాండ్‌గా 'గని' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నందుకు నిర్మాతలకి నేను కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమాకు బలంగా సపోర్ట్  చేసింది వరుణ్. అతని వల్లే నిర్మాతలు అంత ధైర్యంగా ముందుకు వెళ్లారు..అని అన్నారు. అంతేకాదు, ఈ సినిమా చూసిన తర్వాత వరుణ్‌తో చేయల్సింది 'కేజీఎఫ్' లాంటి సినిమా కాదా.. అని అనిపించిందని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.  

Updated Date - 2022-04-03T21:10:38+05:30 IST

Read more