ఒత్తిడి మాయం చేసే ‘ధగఢ్‌ సాంబ’

ABN , First Publish Date - 2022-05-17T05:46:25+05:30 IST

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధగఢ్‌ సాంబ’. సోనాక్షి హీరోయిన్‌. ఎన్‌.ఆర్‌.రెడ్డి దర్శకుడు. ఈనెల 20న విడుదల అవుతోంది...

ఒత్తిడి మాయం చేసే ‘ధగఢ్‌ సాంబ’

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ధగఢ్‌ సాంబ’. సోనాక్షి హీరోయిన్‌. ఎన్‌.ఆర్‌.రెడ్డి దర్శకుడు. ఈనెల 20న విడుదల అవుతోంది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేశారు ముజీర్‌ మాలిక్‌. సోమవారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మాది గుంటూరు జిల్లా నరసరావు పేట. గాయకుడు మనో మా బావ. ఆయన వల్లే నేను చిత్రసీమలోకి అడుగుపెట్టా. ‘మాతృదేవోభవ’ నుంచి ‘అదుర్స్‌’ వరకూ ఛోటా.కె.నాయుడు గారి దగ్గర సహాయకుడిగా పనిచేశా. అప్పటి నుంచి నా ప్రయాణం మొదలైంది. ‘యువరాజ్యం’తో కెమెరామెన్‌ అయ్యా. ‘మేరా భారత్‌ మహాన్‌’, ‘గోలీ సోడా’, ‘కొబ్బరి మట్ట’, ‘క్యాలీ ఫ్లవర్‌’తో పాటు తమిళ, కన్నడలో చెరో సినిమా చేశా. అవన్నీ నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. కొన్ని యాడ్‌ ఫిల్మ్స్‌ కూడా చేశా. ‘ధగఢ్‌ సాంబ’ విషయానికొస్తే.. ఇదో పూర్తి స్థాయి వినోద భరిత చిత్రం. ప్రేక్షకుల ఒత్తిడిని దూరం చేసే మందు... ఈ సినిమాలో ఉంది. ఇప్పటి వరకూ సంపూ చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఇది మరో ఎత్తు. ఆయన చేసిన ఫైట్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. ‘బ్రిలియెంట్‌ బాబు’, ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలు చేయడానికి ఒప్పుకొన్నా’’ అన్నారు. 


Updated Date - 2022-05-17T05:46:25+05:30 IST

Read more