పుట్టిన రోజు వేడుకలకు దూరంగా చిరు

ABN , First Publish Date - 2022-08-23T05:52:11+05:30 IST

సోమవారం చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు...

పుట్టిన రోజు వేడుకలకు దూరంగా చిరు

సోమవారం చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. అభిమానులు సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ‘మెగా కార్నివాల్‌’ పేరుతో పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే చిరు మాత్రం పుట్టిన రోజున హైదరాబాద్‌లో లేరు. ఆయన కుటుంబంతో కలిసి బెంగళూరు వెళ్లారు. మరో రెండు రోజుల్లో హైదరాబాద్‌ తిరిగొస్తారు.


శుభాకాంక్షల వెల్లువ

‘‘చమటను ధారగా బోసి కష్టపడి.. సంపాదించిన దాంట్లో ఎందరికో సాయం చేసిన మా అన్నయ్య..’’ అంటూ పవన్‌ కల్యాణ్‌ చిరుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా తనకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని,  ఆయన జీవితం తెరచిన పుస్తకమని కొనియాడారు పవన్‌. మహేశ్‌బాబు, కె.రాఘవేంద్రరావు, సాయిధరమ్‌ తేజ్‌, వరుణ్‌తేజ్‌, బాబి, మెహర్‌ రమేశ్‌, మమ్ముట్టి, శ్రీనువైట్ల తదితరులంతా చిరుకి బర్త్‌డే విషెష్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-23T05:52:11+05:30 IST

Read more