ఆగస్టులో మొదలు... వేసవిలో విడుదల

ABN , First Publish Date - 2022-07-10T05:56:18+05:30 IST

మహే్‌షబాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’... సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించీ,...

ఆగస్టులో మొదలు... వేసవిలో విడుదల

మహే్‌షబాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’... సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించీ, అందులోని సన్నివేశాల గురించీ మాట్లాడుకొంటూనే ఉంటారు. ఆ తరవాత ‘ఖలేజా’  కూడా మహేష్‌ అభిమానులకు నచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్‌ సినిమా రాబోతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. కానీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్తుందనే విషయంలో క్లారిటీ లేదు. ఇప్పుడు అది కూడా వచ్చేసింది. ఆగస్టులో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తామని నిర్మాత ప్రకటించారు. అంతేకాదు. 2023 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. తమన్‌ సంగీతం అందిస్తారు. అత్యున్నత సాంకేతిక నైపుణ్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్టు, చిత్రబృందం తెలిపింది. త్వరలోనే మిగిలిన నటీనటులు, ఇతర సాంకేతిన నిపుణుల వివరాలు వెల్లడిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎ్‌స.వినోద్‌, ఆర్ట్‌: ఎ.ఎ్‌స.ప్రకాష్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి.


Updated Date - 2022-07-10T05:56:18+05:30 IST

Read more